Tuesday, December 3, 2024
spot_img

అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దు

Must Read
  • రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
  • అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
  • మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ సమావేశం
  • అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి
  • సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లో చేరాలి
  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,దామోదర రాజనర్సింహ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు,ఉన్నతస్థాయి అధికారులతో కలిసి టెలికాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అన్ని జిల్లాల్లో కలెక్టర్లు,ఎస్పీలు,రెవెన్యూ,ఇరిగేషన్,మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు.ఈ సమయంలో అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని,సెలవు పై ఉన్నవారు వెంటనే విధుల్లో చేరి సహాయక పనుల్లో నిమగ్నం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని,ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వెల్లడించారు.

ప్రధాన కార్యదర్శి,డీజీపీ,మున్సిపల్,విద్యుత్,పంచాయతీ రాజ్,హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ప్రజలందరికీ సీఎం విజ్ఞప్తి చేశారు.లోతట్టు ప్రాంత ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Latest News

లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను

మాజీమంత్రి హరీష్‎రావు లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS