- కేంద్రమంత్రులుగా బాద్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రాష్ట్రానికి బండిసంజయ్,కిషన్ రెడ్డి
- ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
- బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ
- తెలంగాణకి చెందిన ఇద్దరు మంత్రుల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్యకర్తలు
తెలంగాణకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి,బండిసంజయ్ ఈనేల 19న ( బుధవారం ) రాష్ట్రానికి వస్తున్నారు.ఢిల్లీలో మోడీతో పాటు కిషన్ రెడ్డి,బండిసంజయ్ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.కేంద్రమంత్రులుగా వీరిద్దరూ బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తుండడంతో టీ.బీజేపీలో ఫుల్ జోష్ నెలకొంది.బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో కిషన్ రెడ్డి,బండిసంజయ్ లకి ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్వాగతం పలికి భారీ ర్యాలీతో రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాద్యతలు స్వీకరించి బాద్యతలు చేపట్టారు.పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ నుండి గెలపొందగా వారిలో కిషన్ రెడ్డి,బండిసంజయ్ కూడా ఉన్నారు.కేంద్రమంత్రిగా తొలిసారిగా బండిసంజయ్ కి అవకాశం ఇచ్చారు.కేంద్రమంత్రులుగా బాద్యతలు చేపట్టిన ఇద్దరు,ఆ శాఖాకి సంబధించిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.