- రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రె ఆనంద్ గౌడ్
- ఎస్సైతో చేయి కలిపిన జర్నలిస్ట్ మహమ్మద్ మస్తాన్
చట్టాన్ని రక్షించి,ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు.తెలంగాణలో లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న ఖాకీల సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతుంది.వరుసగా లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు పోలీసులు.ఇంత మంది అధికారులు పట్టుబడుతున్న వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు.తాజాగా మెదక్ జిల్లా,హవేలీ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రే ఆనంద్ గౌడ్,మెట్రో ఈవినింగ్ మీడియా జర్నలిస్ట్ మొహమ్మద్ మస్తాన్ రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.తన టిప్పర్ ను విడిపించేందుకు ఎస్సై కర్రే ఆనంద్ గౌడ్ రూ.20,000 లంచం డిమాండ్ చేస్తున్నారని పూల గంగాధర్ అనే వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రూ.20,000 స్వాధీనం చేసుకున్నారు.