పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో పతాకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడామిలో పుల్లెల గోపీచంద్,కోచ్ నాగపూరి రమేష్ దీప్తిను అభినందించారు.ఈ సంధర్బంగా దీప్తి మాట్లాడుతూ,వచ్చే పారాలింపిక్స్‌లో భారత దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తానని ధీమా వ్యక్త్రం చేశారు.తాను సాధించిన మెడల్ కోచ్ రమేష్ కి అంకితం చేస్తానని తెలిపారు.చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు,అవమానాలు ఎదురుకున్నని అన్నారు.