- 2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత మాదే
- బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో నిర్లక్ష్యం చేసింది
- మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు కొనసాగుతున్నాయి
- నిధులు కోరితే కేంద్ర ఒక్క రూపాయి కూడా ఇయ్యాలే
- అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం మెట్రో నిర్మాణం పై ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పై రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,పాతబస్తి అంటే ఓల్డ్ సిటీ కాదని,అది ఒరిజినల్ సిటీ అని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తి మెట్రో నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం చేసిందని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలో మెట్రోకు శంఖుస్థాపనలు చేసి,78 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామని వెల్లడించారు.మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు జరుగుతున్నాయని, పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే, కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.రెండో దశ మెట్రో నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ మొదలుపెట్టామని,పాతబస్తీ,ఎయిర్‌పోర్ట్‌కు మధ్య మెట్రోను కచ్చితంగా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.