- సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామం, ఆనంద్‌నగర్ కాలనీలో భూఆక్రమణకు పాల్పడుతున్న అజయ్‌కుమార్ కేడియా
- సివిల్ మ్యాటర్‌లో తలదూరుస్తున్న కొల్లూరు పోలీసులు
- మేమెం చెప్పిందే వేదం.. చేసిందే న్యాయం అంటున్న పోలీసులు
- ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కోర్టు ఆర్డర్ ఇక్కడ చెల్లవుంటూ కంటైనర్లను తొలగించిన పోలీసులు
- కోర్టు ఆర్డర్‌ను లెక్కచేయకుండా యెలిమెల ప్రమోద్ పై కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు
- పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్న అజయ్ కుమార్ కేడియా
- న్యాయస్థానంలో కేడియా ఓడిపోయిన కూడా పోలీసులను అడ్డుపెట్టుకొని దర్జౌన్యం చేయడం ఎంత వరకు కరెక్ట్..?
- పై అధికారులు దృష్టి సారించి, అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నపోలీసులపై చర్యలు తీసుకోవాలన్న బాధితులు
- కోర్టు తీర్పులు ఉన్న ప్రమోద్ కు న్యాయం జరగదా..?
పోలీసులంటే అక్రమార్కులకు భయం పుట్టించేలా ఉండాలి, బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసుల తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది.. కొంతమంది పోలీసుల వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసుల తీరు సరిగా లేదని ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిపోయిన తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలు అన్ని ఇన్ని కావని అందులో కొంతమంది పోలీసులు కూడా అవినీతికి పాల్పడ్డారని బహిరంగంగానే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన ప్రభుత్వ యంత్రాంగాల పనితీరు మారకపోవడంపై ప్రజలు విస్తూపోతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అక్రమార్కులకు కొమ్ము కాయడం సిగ్గుచేటు..

అసలు విషయానికొస్తే.. సంగారెడ్డి జిల్లా, ఆర్‌సి పురం మండలం కొల్లూరు గ్రామం ఆనంద్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 204లో 1985-87 సంవత్సర కాలం మధ్యలో అట్టి భూమిలో 20 ఎకరాల 2గుంట్లలో వెంచర్ చేయడం జరిగింది. అందులో మాజీ సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. వారి పిల్లల భవిష్యత్తు కోసం కొంత భూమి ఉండాలనే సంకల్పంతో వారు అక్కడ పాట్లు కొనుగోలు చేశారు.. ఆ ప్లాట్లపై కన్నేసిన అజయ్ కుమార్ కేడియా అనే వ్యక్తి ఆ భూమి నాదేనంటూ, అక్కడ ప్లాట్లపై ఎవర్ని కూడా రావద్దని హుకుం జారీ చేస్తున్నాడు. అజయ్ కుమార్ కేడియాకు స్థానిక పోలీసుల మద్దతు కూడా ఉందని ప్లాట్లు కొనుచేసిన వారు ఆరోపిస్తున్నారు. ఈ భూమిలోనే యేలిమెల ప్రమోద్ అనే వ్యక్తి 2018-2020 సంవత్సర కాలం మద్యలో 1986 లింక్ డాక్యుమెంట్ల ద్వారా కొన్ని ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ప్లాట్లు కొనుగోలు చేసిన వారిపై అజయ్ కుమార్ కేడియా అనే వ్యక్తి ఈ భూమి నాది అని, నేను కొన్నాను.. ఇక్కడ నుండి వెళ్లిపోవాలని పోలీసుల సహకారంతో అడ్డుకుంటున్నాడు.

అయితే దీనిపై యెలిమెల ప్రమోద్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు తీర్పు ప్రకారం ప్రమోద్‌కు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఎవరైనా మళ్ళీ కబ్జా చేస్తారన్న ఉద్దేశ్యంతో ప్రమోద్ అట్టి భూమిలో కంటైనర్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో పోలీసులు జోక్యం చేసుకొని ఈ భూమి మీది కాదు.. ఇక్కడ కంటెనర్లు ఉంచకుండా వెంటనే ఖాళీ చేయాలని, ఆ కంటైనర్లను సీజ్ చేసి, ప్రమోద్‌పై కేసు నమోదు చేశారు. ఈ భూమి అజయ్ కుమార్ కేడియాది అని హుకుం జారీ చేస్తున్నారు. ఇక్కడ కోర్టు ఆర్డర్లు చెల్లవని మేం చెప్పిందే చెల్లుతుందని పోలీసులు మాట్లాడడం చూస్తుంటే, వారు ఆమ్యామ్యాలు తీసుకున్నట్లు ప్రమోద్ ఆరోపిస్తున్నారు. కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన ఆదాబ్ హైదరాబాద్ పత్రికకు తెలిపాడు.

కొల్లూరు భూ వ్యవహారం కమిషనర్, పై అధికారుల దృష్టిలో ఉన్నట్లు కొల్లూరు పోలీసులకు తెలుసు.. అయినప్పటికి కూడా కొల్లూరు పోలీసులు అక్రమార్కులకు వంతపలకడం విడ్డూరం. ప్లాట్ల యాజమాన్యాలపై అజయ్ కుమార్ కేడియా కోర్టుకు వెళ్ళాడు. న్యాయస్థానం అజయ్‌కుమార్ కేడియా చేసుకున్న డాక్యుమెంట్లు తప్పు అని రద్దు చేయడం జరిగింది (OS No.. 45/2012, OS No.116/2011, OS No. 119/2011). గత 12 సంవత్సరాల క్రితం కోర్టు ద్వారా క్యాన్సిలేషన్ అయిన డాక్యుమెంటులను ప్రమోద్ కుమార్ పోలీసులకు చూపించినప్పటికి, పోలీసులు అజయ్‌కుమార్ కేడియాకు మద్దతు పలకడం గమనార్హం. అజయ్ కుమార్ కేడియా చేసుకున్న భూమి ప్రతాలు కోర్టు రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో అజయ్‌కుమార్ కేడియా డాక్యుమెంట్లు రద్దు అయినట్లు ఈసీలో నేటికి కనపించడం గమనార్హమని ప్రమోద్ తెలిపారు. 1987 నుంచి నేటి వరకు కూడా ప్లాట్ల యాజమానులు పోజిషన్‌లో ఉన్నారు. అదే విధంగా ఇప్పటికి కూడా ఆ ప్లాట్ల యాజమానులకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది.

పోలీసులకు అన్ని రకాల పత్రాలు పలు సార్లు చూపించినప్పటికి, పోలీసులు అజయ్ కుమార్ కేడియాకు వంతపలుకుతూ, నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రమోద్ వాపోయారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు ఎదురొడ్డి సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మాజీ సైనికులు, వారి పిల్లల భవిష్యత్తు కోసం భూమిని కొనుగోలు చేస్తే అట్టి భూమిని అజయ్ కుమార్ కేడియా లాంటి అక్రమార్కులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండడం చాలా బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది పోలీసులపై కొరడా ఝులిపించాలని, ప్లాట్లు కొనుగోలు చేసిన యాజమానులకు న్యాయం చేయాలని ప్రమోద్ కుమార్ మీడియాని ఆశ్రయించారు.
