Sunday, November 10, 2024
spot_img

ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

Must Read
  • పోలీస్ కమిషనర్లు,ఎస్పీలతో సమావేశమైన డీజీపీ
  • సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు
  • వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలి
  • త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు: డీజీపీ జితేందర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు,జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు,ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు.డిజిపి కార్యాలయంలో మంగళవారం వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు.ఆయా జిల్లాలు,కమిషనరేట్‌లకు పంపిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పారు.పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని,ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.పోలీసు కమీషనర్లు,ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని సూచించారు.తాను కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతానని వెల్లడించారు.తనతోపాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వివిధ జిల్లాల్లో తనిఖీలు చేపడతారని పేర్కొన్నారు.హిస్టరీ షీట్‌లు సమీక్షించాలని,ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని,శాంతి భద్రతలు మెరుగైన నిర్వాహణ,ఎస్సీ,ఎస్టీలు,మహిళలకు సంబంధించిన కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతో పాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు.స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు.ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా,రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని డీజీపీ వివరించారు అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి మహేశ్ ఎం భగవత్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి,అదనపు డిజిపిలు శిఖా గోయెల్,అభిలాష బిష్త్,వీవీ శ్రీనివాస్ రావు,విజయ్ కుమార్,స్టీఫెన్ రవీంద్ర,పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి (సైబరాబాద్),జి.సుధీర్ బాబు (రాచకొండ),ఐజిపిలు ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (మల్టీ జోన్-1),వి. సత్యనారాయణ (మల్టీ జోన్ -II),ఎం రమేష్,కె.రమేష్ నాయుడు,నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య,ఇతర పోలీసు కమిషనర్‌లు,జిల్లా ఎస్పీలు సహా కీలక అధికారులు పాల్గొన్నారు.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS