మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. జార్ఖండ్ లో రెండో విడతలో భాగంగా 38 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
మహారాష్ట్రలో మధ్యాహ్నం 03 గంటల వరకు 45.53 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జార్ఖండ్ లో 61.47 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం సాయింత్రం 06:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలకానున్నాయి. మహారాష్ట్రలో సాయింత్రం 06 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ,క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్ననీ,అర్జున్ కపూర్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ రోహిత్ శెట్టి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ముంబైలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.