Thursday, November 21, 2024
spot_img

సీఎం పదవికి పొంగులేటి ఎసరు..

Must Read
  • సీఎం కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తాం
  • టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు
  • బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నారు
  • ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది
  • అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
  • పొంగులేటి శ్రీనివాస్‎కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి
  • సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా ఉండాలి
  • సీఎం పదవిని లాక్కోడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు.సీఎం కుటుంబసభ్యుల అవినీతిని త్వరలోనే తెలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆదివారం తెలంగాణ భవన్‎లో మీడియాతో మాట్లాడతూ,సీఎం రేవంత్ రెడ్డి టెండర్లను తన బావమరిదికి కట్టబెట్టరాని,ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందని వ్యాఖ్యనించారు.బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయారని,ఈ విషయం అయినకు తెలుసని వ్యాఖ్యనించారు.కోడంగల్ లిఫ్ట్ కథతో సహ,రేవంత్ రెడ్డి కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తామని తెలిపారు.
పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం…ఎక్కడ అవినీతి జరిగిందో మాకు తెలియదా..? అని అన్నారు.ప్రభుత్వానికి చట్టలే కాదు,చుట్టరికాలు కూడా తెలియనట్లుందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి తరచుగా చెబుతున్న ఫోర్త్‌ సిటీ కాదని,ముచ్చర్ల ఫోర్‌ బ్రదర్స్‌ సిటీ అని ఆరోపించారు.

అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా :

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‎కి కేటీఆర్ సవాల్ విసిరారు.అమృత్ టెండర్లో ఎలాంటి తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యనించారు.పొంగులేటి శ్రీనివాస్‎కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తనతో కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలని కోరారు.సీజే వద్దకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే తేదీ,సమయం ఫిక్స్ చేయాలని,కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వద్దకి వెళ్దామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‎కి ఛాలెంజ్ చేశారు.ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా ఉండాలి :

సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.సీఎం పదవిని లాక్కోడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నరని విమర్శించారు.
మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్,కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కొల్పవబోతున్నాడాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యనించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని,ఏం జరిగినా తమకు తెలుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.తప్పకుండా అన్నీ విషయాలు బయటకు వస్తాయని,అన్నీ బయట పెడతామని హెచ్చరించారు.

సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారు :

సింగరేణి లాభాలను రూ.1000 కోట్ల లాభాలను దాటించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే అని కేటీఆర్ తెలిపారు.తొమ్మిదిన్నర ఏండ్లలో తాము రూ.2,780 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో సింగరేణి అద్భుత ప్రగతి సాధించిందని వెల్లడించారు. పదేండ్లలో సింగరేణి లాభాలు గణనీయంగా పెరిగాయని,లాభాల్లో కార్మికుల వాటా పెంచుకుంటూ వచ్చామని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో పది పైసల వాటా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు.కాంగ్రెస్‌ పాలనలో 11 పైసల నుంచి 20 పైసల వరకు మాత్రమే ఇచ్చారని,1999 నుంచి 2014 వరకు కేవలం రూ.376 కోట్లు మాత్రమే సింగరేణి కార్మకులకు ఇచ్చారని తెలిపారు.2022-23లో సింగరేణి లాభాల్లో కార్మికులకు 32 శాతం వాటా ఇచ్చామని,సగటున ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 60 వేలు చెల్లించమని అన్నారు.కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS