- కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగానే మారాయి
- నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు
- లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు నిర్మల్ ఎమ్మెల్యే,బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.శనివారం అయిన అసెంబ్లీ మీడియా హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగా మారాయని ఆరోపించారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో ను డమ్మీ పేపర్ గా తయారు చేశారని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ లు తీసుకుంటూ నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శించారు.లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుందని,ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.పల్లెలో పర్యటించి ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.కేవలం హైదరాబాద్ లో ఉంటూ ప్రజా పాలనా అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.గ్రామాల అభివృద్ధి పై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.