ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.జాష్పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక పై,ఆరు మంది మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఆగస్టు 01న సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన ఓ బాలిక సమీపంలోని మార్కెట్ లో ఏర్పాటు చేసిన జాతరను చూడడానికి వెళ్ళింది.రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో నిందితులు ఆ బాలికను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకొని వెళ్ళి,అక్కడే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు.మొత్తంగా 07 మంది నిందితులు ఈ దారుణనికి పాల్పడ్డారని,అందులో ఆరుగురి వయస్సు 16 నుండి 17 ఏళ్ల మద్య ఉందని,మరో నిందితుడి వయస్సు 18 ఏళ్లు ఉందని పోలీసులు వెల్లడించారు.