- ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది..
- ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
బస్వరాజు సారయ్య సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2020 లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేగా నియమితులయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతూ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ పదవి ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చారు. ఆయన కూడా అధికార కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలవడంతో ఆయన చేరిక లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.