Thursday, November 21, 2024
spot_img

త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు,కసరత్తు ప్రారంభించిన సర్కార్

Must Read
  • రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి
  • ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన
  • వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.దీంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచిస్తుంది.సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ మంత్రులు,అధికారులతో సమీక్షించారు.ఈ మేరకు రేష‌న్‌,ఆరోగ్య,ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాల‌ని,ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో ప్ర‌తి కుటుంబస‌భ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందుపర్చి,దీర్ఘ‌కాలంలో వైద్య సేవ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.కుటుంబాల్లో కొత్త స‌భ్యులు చేరినప్పుడు లేదా తొల‌గించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాల‌ని ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్ట‌ణ‌,ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద కార్యాచ‌ర‌ణ ప్రారంభించాలని తెలిపారు.ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వ్య‌వ‌స్థను మానిట‌రింగ్ చేయడం కోసం జిల్లాల వారీగా వ్యవస్థల‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS