Sunday, November 10, 2024
spot_img

ఆయిల్ పామ్ సాగు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Must Read

-మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృశ్య తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సుక్మా సెద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తుందని అని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగిందని వెల్లడించారు.2023-24 సం.కి గాను ఆయిల్ పామ్ సాగు పధకం (ఎన్.ఎం.ఈ.ఓ – ఓపి ) కింద కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.రూ.53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తం రూ.133.50 కోట్లు విడుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.2023-24 సం.లో కేవలం రూ.32.72 కోట్లు మాత్రమే విడుదల చేయగా,వివిధ కారణాల చేత రూ.100.76 కోట్లు పెండింగ్ లో పెట్టడం జరిగిందని అన్నారు. దీని వలన ఉద్యాన శాఖ, రైతులకు మరియు ఆయిల్ పామ్/ డ్రిప్ కంపెనీలకు, సకాలంలో బకాయిలు విడుదల చేయడం వీలుపడలేదని స్పస్టం చేశారు.ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆయిల్ పామ్ రైతుల మరియు కంపెనీల ఇబ్బందులను తీసుకురాగ,పెండింగ్ లో వున్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. 2-3 రోజులలో ఆయిల్ పామ్ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగుకు సంబందించిన రాయితీలను, రైతుల ఖాతాలలో జమ చేయుటకు ఉద్యానశాఖ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.బకాయిలు విడుదలైనందువలన 2024-25 సంవత్సరానికి గాను నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకొనేవిధంగా రైతులను ఆయిల్ పామ్ చేపట్టుటకు ప్రొత్సహించవలసిందిగా ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించడం జరిగింది.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS