Friday, September 20, 2024
spot_img

213 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాబిక్ష

Must Read

రాష్ట్ర ప్ర‌భుత్వం 213 మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది.దీర్ఘ‌కాలంగా జైళ్ల‌లో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలంటూ ఖైదీల కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌జా పాల‌న సందర్బంగా ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు.స్పందించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించిన సీనియ‌ర్ అధికారులు,అర్హులైన వారి వివ‌రాల‌ను హైలెవ‌ల్ క‌మిటీ ముందుంచారు.హైలెవ‌ల్ క‌మిటీ విడుద‌ల‌కు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందు ఉంచింది.ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఖైదీల విడుద‌ల‌కు ఆమోద‌ముద్ర వేసింది.అనంత‌రం ఆ జాబితాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేయ‌డంతో ఖైదీల ముంద‌స్తు విడుద‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం చ‌ర్ల‌పల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు బుధ‌వారం విడుద‌ల కానున్నారు.వీరిలో 205 మంది యావ‌జ్జీవ శిక్ష ప‌డిన వారు,ఎనిమిది మంది త‌క్కువ కాలం శిక్ష‌ప‌డిన వారున్నారు.వీరంద‌రికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన‌ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు.మెరుగైన ప్ర‌వ‌ర్త‌న ద్వారా సమాజంలో తిరిగి క‌లిసిపోవ‌డానికి వారంద‌రికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This