Thursday, November 21, 2024
spot_img

ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి

Must Read
  • సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి
  • సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం
  • గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది
  • డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి

డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం14 ఫోర్ వీలర్ వాహనాలను,55 టూ వీలర్ వాహనాలు,యాంటీ నార్కోటిక్ విభాగం కోసం 27 ఫోర్ వీలర్ వాహనాలు,59 టూ వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగిందని విమర్శించారు.నేరాలు చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టొద్దని, ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సినీ యాజమాన్యాలు టికెట్ల పై పెట్టిన శ్రద్ధ,సామజిక బాధ్యతల పై పెట్టడం లేదని పేర్కొన్నారు.ప్రతి సినిమా ప్రారంభానికి ముందు డ్రగ్స్ ను అరికట్టడం పై అవగహన కల్పిస్తూ ఓ వీడియో పెట్టాలని ఆదేశించారు.డ్రగ్స్ కేసులో సెలబ్రెటీలు పట్టుబడిన ఇకనుండి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయని తెలిపారు.సినిమా టికెట్లు పెంచాలని అనుకునే వారు ఇక నుండి అవగహన వీడియోలు చూపించాలని,ఇలా చేస్తేనే టికెట్ల పై వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు.నేరాలను అరికట్టడంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం డ్రగ్స్ నివారణకు హీరో మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో ప్రభుత్వానికి అందించారు.ఈ సందర్బంగా చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS