Friday, September 20, 2024
spot_img

ఏపీలో కూటమి సాధించిన విజయం,అద్భుతమైన విజయం

Must Read
  • ఎన్డీయే కూటమి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు
  • చంద్రబాబు పేరుని బలపరిచి,శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్
  • చంద్రబాబు నాయకత్వం,అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం
  • ఎన్డీయే సాధించిన విజయం దేశవ్యాప్తంగా అందరికి స్ఫూర్తినిచ్చింది

తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడుకి రాజకీయాల పై ఉన్న అనుభవం,అయిన నాయకత్వం ఏపీకి ఎంతో అవసరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఎన్డీయే కూటమికి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయం అని తెలిపారు.రాష్ట్రం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు అవసరమని,అది చంద్రబాబు వల్లే సాధ్యమని అన్నారు.ఎన్డీయే కూటమి శాసనసభ పక్షనేతగా చంద్రబాబు పేరుని బలపరుస్తునట్టు పవన్ పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్డీయే సాధించిన విజయం దేశవ్యాప్తంగా అందరికి స్ఫూర్తినిచ్చిందని,అద్భుతమైన విజయంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This