మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కేవలం మిత్రపక్షా రాష్ట్రాలకే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు.2024-25 వార్షిక బడ్జెట్ లో ఏపీ,బీహార్ రాష్ట్రాలకు కేంద్రం వరాలజల్లు కురిపించింది.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకూడని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య,హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు.తమ పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వెల్లడించారు.