- మాజీ మంత్రి హరీష్ రావు
వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన అయిన వరద ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.భారీ వర్షాల కారణంగా 30 మంది మరణిస్తే,ప్రభుత్వం మాత్రం 15 మంది మరణించారని చెబుతున్నారని విమర్శించారు.మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపిస్తుందని వ్యాఖ్యనించారు.ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమకాలువకు గండి పడిందని మండిపడ్డారు.ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్లే భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగిందని అన్నారు.రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని,రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లాలని డిమాండ్ చేశారు.వరద బాధితుల నిత్యవసరాలు వరదలో కొట్టుకుపోయాయని అన్నారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి ఖమ్మం,మహబూబాబాద్ ప్రజలు బలైపోయారని విమర్శించారు.మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.