Monday, November 25, 2024
spot_img

ఆదానీ రూ.100 కోట్లను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా ఆదానీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదానీ వ్యవహారంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ కోసం ఎంతోమంది నిధులు ఇచ్చారని అన్నారు. ఆదానీ సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‎బిలిటీ కింద రూ.100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. నిధులను ట్రాన్స్‎ఫర్ చేయవద్దని ఆదానీ గ్రూప్‎కు లేఖ రాశామని తెలిపారు.

ఆదానీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వివాదాలకు లోనుకావడం ప్రభుత్వానికి ఇష్టంలేదని అన్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు. ఢిల్లీ పర్యటనపై మాట్లాడుతూ, ఢిల్లీ పర్యటనకు,రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. లోక్‎సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు.

Latest News

డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్‎తో కొంతపుంతలు తొక్కుతున్న సైబర్ దొంగలు

ఆన్‎లైన్ స్కాంలు చేయడంలో కొత్త పుంతలు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. డీప్ ఫేక్ అనే...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS