Friday, November 22, 2024
spot_img

మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

Must Read
  • నిరుద్యోగులు చేస్తున్న నిరసనల పై స్పందించిన ఉపముఖ్యమంత్రి
    భట్టి విక్రమార్క
  • ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే 30 వేల మందికి
    నియామక పత్రాలు ఇచ్చాం
  • మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా మేము సిద్ధం
  • పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం
  • 11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం
  • జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు
  • 5 వేల నుండి 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ నిర్వహిస్తాం

గత కొన్ని రోజులుగా తెలంగాణలో నిరుద్యోగులు చేస్తున్న నిరసనల పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు.ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన పై దృష్టి పెట్టిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు.మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,అందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి సాధ్యమైనన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఉద్యోగాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం,అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యయ ఖాళీలను గుర్తించి,11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు.జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించే డీఎస్సీ పరీక్ష కోసం హాల్ టికెట్లను అందుబాటులో ఉంచామని స్పస్టం చేశారు.కొన్ని నెలలుగా ఈ పరీక్ష కోసం అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారని గుర్తుచేశారు.రానున్న రోజుల్లో 5 వేల నుండి 6 వేల పోస్టులతో మరో డీఎస్సీను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.గత పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క గ్రూప్ 01 పరీక్ష కూడా నిర్వహించలేదని వెల్లడించారు.నిరుద్యోగులకు వెంటవెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ ప్రభుత్వం ఆలోచనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS