ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.గురువారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కి దిగింది.20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 పరుగులు చేయగా,సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు.ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు.రవీంద్ర జడేజా 17 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 10 పరుగులు చేశాడు.అ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు 103 పరుగులకే కుప్పకూలింది.బౌలర్లు అద్భుతమైన బాలింగ్ చేయడంతో భారత్ విజయం సాధించి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.