Friday, September 20, 2024
spot_img

ముగిసిన డీఎస్ అంత్యక్రియలు

Must Read

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షులు,సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామబాద్ లో ముగిసాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో ఆదివారం ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు అయిన తుదిశ్వాస విడిచారు.చివరిచూపు చూడడం కోసం అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.మరోవైపు ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళుర్పించారు.అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు.వివిధ పదవుల్లో పనిచేసిన శ్రీనివాస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డీఎస్ చొరవ ఎంతో ఉందని,పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ధర్మపురి శ్రీనివాస్ అని అయిన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు డీఎస్ తనతో చెప్పినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.పదవుల పై ఆశ లేదని,చివరి క్షణంలో పార్టీ జెండాను తన దేహం పై ఉండాలని చెప్పినట్టు రేవంత్ రెడ్డి అన్నారు.

1948లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.పార్టీలో అంచె లంచెలుగా ఎదిగారు డీఎస్.రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This