Sunday, September 22, 2024
spot_img

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో బదిలీల దందా..!

Must Read
  • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో అవినీతి తిమింగ‌లాలు
  • పైసలకు కక్కుర్తిపడి ఫైరవీలు చేస్తున్న డీఆర్
  • ఎస్ఆర్ఓ,డీఆర్ఓల వద్ద కోట్లల్లో వసూల్లు..?
  • ఫైల్ పై హడావుడిగా సంతకం చేసిన మంత్రి
  • తనా అనుకున్న వారికి డిమాండ్ పోస్టులు
  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతరు
  • జీవో నెం.80ని సైతం పట్టించుకోని వైనం
  • జీరో సర్వీస్ పేరుతో 144 మంది బదిలీలు

తెలంగాణలో వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కొందరికి ఇష్టమొచ్చిన చోటుకి,అనుకూలమైన పోస్టులో కూర్చునేందుకు ఆస్కారం ఉండడం గమనార్హం.వడ్డించే వాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్న తునకలు పడుతాయన్నట్టు ఆయా డిపార్ట్ మెంట్ లలో పైసలు పెడితే ఎక్కడంటే అక్కడకి ట్రాన్స్ ఫర్,ఏ పోస్టింగ్ కావాలంటే ఆ పోస్టింగ్ దక్కడం పెద్ద పనేమికాదు. ట్రాన్స్ ఫర్స్ ల్లో ఎంతో ట్రాన్స్పరెన్స్ మెయింటెన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయి.కానీ కొందరు ఉద్యోగులకు వల వేసి డిమాండ్ ఉన్న పోస్టింగ్ లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. ‘చల్లకొచ్చి ముంత దాచినట్లు’ పైసలు తీసుకొని ఫైరవీలు నడిపించిన అధికారులు అటెనుక మాటమార్చుతున్నారు. శాఖపరమైన సర్క్యూలర్స్ ఇచ్చేసుకుని గత ప్రభుత్వంలో జరిపిన దందాలే మళ్లీ ఇక్కడ చేస్తున్నారు. అదే వ్యక్తులు అదే వ్యవస్థ. కొత్తగా మారింది ఏమి లేదని అధికారులు చెప్పుకుంటున్నారు. మంత్రికి హెల్ప్ చేసిన ఓ సబ్ రిజిస్ట్రర్ కి అవకాశం ఉంటే మంచి పోస్టింగ్ ఇవ్వాలని కోరితే.. వారి నిజాయితీ నిరూపించేందుకు వేరే ఆఫీస్ కి బదిలీ చేశారని తెలస్తుంది.

ఇందులో భాగంగా స్టాంప్ప్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖలో అవినీతి రాజ్యమేలుతుంది. ఆ డిపార్ట్ మెంట్ లో పనిచేసే అప్పటి డీఆర్ఓ, తాజా డీఆర్ ఆధ్వర్యంలో బది’లీలలుస జ‌రిగాయి.. సుమారు కోట్ల రూపాయలు దండుకుంటూ పోస్టింగ్ లు ఇప్పించారు. వసూలు చేస్తూ మన అనుకున్న వారికి ఇష్టమొచ్చిన చోటుకు బదిలీలు చేపించారు. రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారిని బదిలీ చేయవద్దని జీవో నెంబర్ 80 చెప్పుతున్నప్పటికి ఆ విషయాన్ని బుట్టదాఖలు చేశారు. జీరో సర్వీస్ పేరుతో 144 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ రిజిస్ట్రర్ శాఖ ఐజీ జ్యోతి బుద్ద ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రర్ శాఖలో బదిలీలు విచ్చల విడిగా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సబ్ రిజిస్ట్రర్ ల బదిలీల్లో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రర్ పాత్రపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. జూలై 31 దాటితే కొత్త జీవోలు అవసరమనుకున్న వారు మంత్రి హడావుడిగా ఉన్న సమయంలో అన్ని బాగానే చేశామని చెప్పుకుంటూ అనుమతి తీసుకున్నారు. ఇదే విషయంపై 28న వెళ్లితే తొందర వద్దన్న మంత్రి, అధికారుల ఒత్తిళ్లకు బదిలీలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ కి బదిలీ అయినా డీఆర్ పై అవినీతి అరోపణలు వస్తున్నాయి. బదిలీల్లో కీలక పాత్ర పోషించించినట్లు తెలుస్తుంది. సీఎంఓలో శేషాద్రి, ఐజీ బుద్దా ప్రకాశ్, అడిషనల్ ఐజీ వెంకటరాజంలకు ఈ బదిలీల వ్యవహారం చూసుకున్నారు. ఈ ఉన్నతాధికారులకు డీఆర్ తియ్యటి మాటలు చెప్పి చక్రం తిప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో డిమాండ్ ఉన్న సబ్ రిజిస్ట్రర్స్ కి కోట్ల రూపాయలు డీల్ జ‌రిగిన‌ట్లు స‌ర్వ‌త్రా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. వద్దన్న వచ్చిపడే సొమ్ముతో ఈ బదిలీ పెట్టుబడి 6 నెలల్లోనే సబ్ రిజిస్ట్రర్స్ సంపాదిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ డిమాండ్ ఉన్న పోస్టులకు గత ప్రభుత్వంలో ఈయనే చక్రం తిప్పారని గుసగుసమంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఇయనే అందరికి పొస్టింగ్ ల గురించి చర్చించారు. డిమాండ్ ఉన్న 8 పోస్టులకు సుమారు కోటి రూపాయల చొప్పున డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తుంది.మల్టీజోన్ 2,గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రర్ కి దాదాపు 80 లక్షలు, జోన్ లో ఒక్కొక్క పోస్టుకు సుమారు 20 నుంచి 50 లక్షల వరకు బేరం మాడినట్లు తెలుస్తోంది. డిమాండ్ ఉన్న పోస్టుల్లో ఉన్న వారికి మళ్లీ అంతే డిమాండ్ ఉన్న పోస్టింగ్ లు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మేడ్చ‌ల్ జిల్లా రిజిస్ట్రార్ స్థితప్రజ్ఞ సేవ‌లు అద్భుతం అన్న‌ట్లు, ఈ శాఖ‌లో స‌క్ర‌మంగా విధులు నిర్వ‌ర్తించేవారే లేన‌ట్టు రంగారెడ్డి జిల్లా ఆడిట్ రిజిస్ట్రార్ గా అద‌న‌పు బాధ్య‌త‌లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.. ఇదే అంశం పై నిఘా వర్గాలు అధారాలు సేకరిస్తున్నాయి. రోజుకు సుమారు రూ.5 లక్షలకు పైగానే అవినీతి సొమ్ము స‌మ‌కూర్చుకునేంత ఖ‌రీదైన‌ది రంగారెడ్డి డీఆర్ పోస్ట్.

ఇకపోతే బదిలీల కోసం డబ్బులు ఇచ్చి పొస్టింగ్ తెచ్చుకున్న వారు.. డబ్బుల వేటలో ఎన్నో తప్పిదాలు చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురానున్నారు. సబ్ రిజిస్ట్రర్ కార్యాలయానికి వెళ్లితే అక్కడి అవినీతి ఏంటో తెలుస్తుంది. ఎదో కొర్రిపెట్టి పంపిస్తారు. బ్రోకర్స్ , డాక్యుమెంట్ రైటర్స్ లేనిది ఫైల్ ముందుకే కదలదు. అన్ని అన్ లైన్ అని చెప్పుకున్నా.. ఫైరవీకారులు లేనిది ఓ సామాన్యుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. అసలు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన సామాన్యుడికి ఎంత న్యాయం జరుగుతుంది అర్థమవుతుంది.ఇదీలా ఉండగా ఒక్క శాఖ బదిలీలతోనే సుమారు 30 కోట్లు చేతులు మారాయని అరోపణలు వస్తున్నాయి. కాగా ప్రభుత్వం పెద్దలు విచారణకు ఆదేశిస్తారా..? లేదా లైట్ తీసుకుంటారా వేచి చూడాలి.

రంగారెడ్డి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో డీఆర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ అవినీతి అక్ర‌మాల‌పై పూర్తి ఆధారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌..మా అస్త్రం..అవినీతిపై అస్త్రం.

Latest News

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్...
- Advertisement -spot_img

More Articles Like This