- సంచలన విషయాలను వెల్లడించిన దర్యాప్తు సంస్థలు
- కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా భారీ దాడికి ప్లాన్ చేసిన ఐ.ఎస్.ఐ
- తమ జిహాదీ సంస్థలను నెలకొల్పేందుకు కార్యాచరణ మొదలుపెట్టిన ఐ.ఎస్.ఐ
జమ్మూకాశ్మీర్ లోని రియాసీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.శివఖోడి నుండి కాట్రా వెళ్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో పదిమంది యాత్రికులు మరణించగా,30 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు.గాయపడిన వారిని వెంటనే ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఉగ్రవాదులు దాడి చేశారని తెలుసుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కుంభింగ్ చేపట్టాయి.ఇదిలా ఉంటే ఈ దాడి వెనుకాల తమ హస్తం ఉందని టీ.ఆర్.ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.ఈ ఘటన పై విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మూడు నెలల క్రితమే దాడికి ప్లాన్ :
ఈ ఘటన పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెల్లడించాయి.కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా భారీ ఉగ్రదాడికి ఐ.ఎస్.ఐ ప్లాన్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.స్థానిక యువకులని తమ వలలో వేసుకొని భారత్ పై భారీ ఉగ్రదాడి చేయాలనీ ఐ.ఎస్.ఐ మళ్ళి తన జిహాదీ సంస్థలను నెలకొల్పేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల్లో దాడి చేస్తే దేశంలో అలజడి సృష్టించొచ్చు అని ఆ సంస్థ భావించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జైష్-ఎ-మహమ్మద్,లష్కరే తోయిబా సంస్థ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాశ్మీర్ లోయలో తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని రాష్ట్రపతి,ప్రధాని నరేంద్ర మోడీ,రాహుల్ గాంధీ ఖండించారు.