Sunday, November 10, 2024
spot_img

నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి

Must Read
  • రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి
  • ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు: విద్యార్థి,నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్
  • నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం
  • తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రాజారాం
    యాదవ్ డిమాండ్

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు,పలు సంఘాల నాయకులు టీజీపీఎస్స్సి భవనాన్ని ముట్టడించారు.ఈ సందర్భంగా విద్యార్థి,నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ,అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసిందని విమర్శించారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలొనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించారు.ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి,నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని తెలిపారు.తేదీలతో సహా కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని,నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,అధికారంలోకి వచ్చి, 6 నెలలైనా ఉద్యోగాల ఊసేత్తడం లేదని విమర్శించారు.రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్తి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నాయకులు మన అశోక్ యాదవ్,లింగం శాలివాహన,ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు జక్కుల మధు తదితరులు పాల్గొన్నారు.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS