పుస్తకాల బరువు బాల్యాన్ని కుంగదీస్తుంది..
చిన్నారుల వెన్నముక్క వంగిపోతుంది..
నర్సరీ,ఎల్.కే.జి,యూకేజీ పిల్లలకు అసలు పుస్తకాలు
వుండ వద్దనే నిబంధన వున్నా పట్టించుకునే నాధుడే లేడు..
తుంగలో తొక్కినా విద్య హక్కు చట్టం నిభందనలు..కిలోల పుస్తకాల బరువుతో వివిధ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు..
శారీరకంగా,మానసికంగా క్రుంగి పోయి హాస్పిటల్
బాట పడుతూ వున్నా వైనం,అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జనే ద్యేయంగా ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీ.పిల్లలకు,తల్లితండ్రులకు శాపంగా మరి కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్న పుస్తకాల బరువు
తగ్గించేలా మేధావులు,ప్రభుత్వం పునరాలోచించాలి.పిల్లలకు అట పాటలతో అర్థవంతం అయిన పుస్తకాలతో
బోధన నడవాలి – కామిని సతీష్ రెడ్డి
Must Read