నీట్ 2024లో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.నీట్ 2024 పరీక్షా పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ 1500మంది విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను పరిగణంలోకి తీసుకుంటామని వెల్లడించారు.నీట్ పరీక్షకు 24 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.నీట్,జేఈఈ లాంటి పరీక్షలను
ఎస్టీఎ విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు.ఈ అంశం పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని,బాధ్యుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మే 05న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా జరిగింది.జూన్ 04న నీట్ ఫలితాలను ప్రకటించారు.ఫలితాల తర్వాత 67మందికి మొదటి ర్యాంక్ రావడం,ఒకే పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అత్యదిక మార్కులు రావడం,గ్రెస్ మార్కుల వల్లే తమకు ఇలా జరిగిందని విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.1563 మంది విద్యార్థులకు గ్రెస్ స్కోర్ లను అందించడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని కేంద్ర కమిటీ పేర్కొంది.అనేక మంది విద్యార్థులు తమ ఫలితాల పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్ధి సంఘాలు కూడా వెంటనే ఈ అంశం పై విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలనీ కోరుతున్నాయి.
Must Read