జనానికి దగ్గరగా,ప్రభుత్వ పథకాలకు దూరంగా పుట గడిస్తే చాలు
అనుకునే భరతమాత బిడ్డలు ఎందరో.. ??
ఎన్నోసార్లు ఓటు హక్కు వినియోగించుకొని నిలువ నీడ కోసం ఎదురు చూసే శరణార్థులు అయ్యారు నేడు..
కన్నీళ్లను మంచినీళ్ళుగా తాగి బ్రతికిడదిస్తున్న దుస్థితి కొందరిది..
రెండు రకాల కూరలతో అన్నం వద్దు,కారం
మెతుకులు చాలు అనే పరిస్థితి మరికొందరిది..
దేశం ప్రగతి పథంలో ఉన్నదన్న సారు..!!
కుడు,గూడు కోసం ఎదురుచూసే అభాగ్యులు ప్రతి ఊరిలో
పదుల సంఖ్యలో ఉన్నారు…కనిపించని దేవుడిని అడగాలా..?? ఓటు వేసే యంత్రంలా చూసే రాజకీయ నాయకులను అడగాలా ఏనాడూ మరునో వారి బ్రతుకులు..పేదవాడి బ్రతుకులు మారే సంస్కరణలు
అమలు చేయండి సారు..!!
- రమేష్ గాండ్ల