రైతు రుణమాఫీ చేస్తున్న మీకు పెద్ద నమస్కారాలు.. కానీ, దీనివల్ల మరి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు జేస్తున్నరు కదా.. అసలు అన్నదాతలను అప్పుల పాలు జెయ్యకుంటే ఇంకా బాగుండు కదా.. అగ్గువకే విత్తనాలు, ఉచిత ఎరువులు, ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు పంపిస్తే, పంటకు గిట్టుబాటు రేటు ఇస్తే మంచిగుండు.. రైతే రాజు అన్న రాజకీయ నాయకుల మాటలు విన్నప్పుడు వ్యవసాయం కోసం అప్పులెక్కువై ఉరికొయ్యాలకి వేలాడుతున్న రైతు కానరాట్లేద.. కౌలు రైతుల దీనగాథ మీ పాలకులకు వినపడటం లేదా.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకే నోట్లోకి బువ్వబోవట్లేదంటే.. అందుకు కారకులు పాలకులు కాదంటారా.. ఐదేళ్లకోసారి, సర్కార్ మారినప్పుడే అప్పులు మాఫిజేసుడుకంటే అసలు రైతుకు అప్పు కాకుండా చేస్తే బాగుంటదేమో.. ఒక్క సారి ఆలోచించుర్రి సారూ..!
- సాగర్