Friday, September 20, 2024
spot_img

కవితకు కలిసొచ్చేనా కాలం..?

Must Read
  • త్వరలో బెయిల్‌.. కాబోయే సీఎం కవితేనా.!
  • జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.!
  • మొన్న జగన్‌, నిన్న రేవంత్‌, చంద్రబాబులకు అవకాశం
  • ఢల్లీి లిక్కర్‌ కేసులో జైలు పాలైన కేసీఆర్‌ కూతురు
  • నేడో, రేపో బెయిల్‌ పై బయటకు వచ్చే ఛాన్స్‌
  • కేటీఆర్‌ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్‌
  • అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.?
  • అన్నకు చెల్లె చెక్కు పెట్టనుందా..?
  • తెలంగాణలో కీలకం కానున్న కవిత
  • ఫ్యూచర్‌ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం

‘కలిసొచ్చే కాలం వస్తే.. నడిసొచ్చే కొడుకు పుడతాడు’ అనే సామెత ఒకప్పటిది. కానీ, జైలుకు వెళ్లీ వస్తే. సీఎం అయ్యే భాగ్యం వస్తది’ అన్నది నేటి సామెత. ప్రస్తుత పరిస్థితుల చూస్తుంటే అదీ నిజమే అనిపి స్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఇద్దరూ సీఎంలు, తెలంగాణ ముఖ్యమంత్రి జైలుకెళ్లి వచ్చాకనే సీఎం సీటు దక్కిందని చెప్పాలి. ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లివచ్చారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సైతం గతంలో జైలు పాలు అయినోడే. అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిడ్డ కల్వకుంట్ల కవిత కూడా ఢల్లీి లిక్కర్‌ కేసులో ఇరుక్కుంది. అందులో భాగంగానే మార్చి 15న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలల పాటు తీహార్‌ జైలులో ఉన్నది.ఆమె ఎప్పుడ్కెనా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో కుమ్మక్కై ఢల్లీి మద్యం కేసులో ఇన్‌ వాల్వ్‌ అయిన కవిత కల్వకుంట్ల ఫ్యామిలీకి మాయని మచ్చ తెచ్చిపెట్టింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం అటు కూతురు కవిత జైలుకు పోవడంతో మాజీ సీఎం కేసీఆర్‌ కు నిద్రపట్టడం లేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మోడీతో స్నేహం చేశాడు ఆ తర్వాత కొంత కాలానికి మళ్లీ విడిపోయారు.బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ ఏతుల ఫుంజూ మాటలు చెప్పిన సారూకు ఇదీ కోలుకోలేని ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోను దోస్త్‌ తనం చెడిపోవడంతో గులాబీ బాస్‌ కు ఏం చేయాలో పాలుపోలేదు. ఇక చేసేదేంలేక కేంద్ర పెద్దలతో రాయబారాలు పంపినట్లు తెలుస్తోంది. లిక్కర్‌ కేసులో జైలు పాలైన కూతుర్నీ బయటకు తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కానీ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్‌ లోనే బీఆర్‌ఎస్‌ బీజేపీకి సఫోర్ట్‌ చేసిందనీ కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. దాంట్లో ఎంత వరకు నిజమో తెలియదు. బిడ్డ జైలుకు పోతే సెంట్రల్‌ తో కాళ్ల బేరానికి పోతే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదని గమనించిన కేసీఆర్‌ అందుకు తగ్గట్టు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గత ఒప్పందమో, రాజకీయ వ్యూహామో తెల్వదు కానీ త్వరలోనే కవితక్క జైలు నుంచి బయటకు రానుందని వార్తలు గుప్పుమంటున్నాయి.

తెలంగాణలో తిరుగులేని శక్తిగా కవిత :

మద్యం కేసులో అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో రెండుసార్లు బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం, పదేళ్ల పాటు తండ్రి కేసీఆర్‌ పాలించడం ఆమెకు ప్లస్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. గత పాలనలో ఎంతో మంది రైతులు, పేదలకు న్యాయం జరిగినట్టు, మహిళలకు మంచి ప్రాధాన్యత దక్కిందనేది గులాబీ లీడర్ల మాట. రెండుసార్లు మంత్రిగా ఉన్నప్పటికి అన్న కేటీఆర్‌ కు మంచి పేరు రాలేదని, అటు బావ హరీశ్‌ కూడా రెండు సార్లు మంత్రి పదవీ అనుభవించారు. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోలేక పోయారు. కానీ ఒక్కసారి కూడా మంత్రి పోస్టు తీసుకోని కవిత మాత్రం స్త్రీలు, యువతలో మంచి క్రేజ్‌ ఉంది. అంతేకాకుండా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెకు ఫాలోయింగ్‌ పెరగనుందని మేధావులు చెబుతున్నారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు సైతం తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కూడా జ్కెలుకు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ కవిత ఐదు నెలల పాటు జ్కెలు జీవితం గడిపిన ఆమెకు ఇదీ ప్లస్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జైలు నుంచి విడుదల్కెన తర్వాత తెలంగా ణలో రాజకీయాలు ఊపందుకునే ఛాన్స్‌ ఉంది. ఆమె అధికార కాంగ్రెస్‌ టార్గెట్‌గా ముందు వెళ్లనుంది. ఢీలా పడిపోయిన బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతూ నెక్ట్స్‌ అధికారమే లక్ష్యంగా ప్రజల్లో దూసుకుపోనుందని చర్చ జరుగుతుంది.

గతంలో ఖైదీలే.. నేడు ముఖ్యమంత్రులు :

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కొడుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16నెలల పాటు జ్కెలుకు వెళ్లి వచ్చాడు. చంచల్‌ గూడ జైలులో ఊసలు లెక్క పెట్టాడు. ఆ తర్వాత 2019 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మాజీ తెదేపా నేత, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఓటు కు నోటు కేసులో అరెస్ట్‌ అయినాడు. ఎమ్మెల్సీ స్టీఫెన్‌ కు రూ. 50లక్షలు ఇస్తూ రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో నెల రోజులకు పైగా చర్లపల్లి జైలులో ఉండి వచ్చాడు. తదనంతరం ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లో చేరి మొదలు పీసీసీ ఛీప్‌ అయ్యాడు. 2023 డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎలక్షన్స్‌ లో కాంగ్రెస్‌ కు మెజార్టీ సీట్లు రాగా సీఎం అవకాశం రేవంత్‌ రెడ్డికి దక్కింది. ఇకపోతే తెదేపా అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పోయివచ్చిన తర్వాత మళ్లొకపాలి సీఎం అయ్యే ఛాన్స్‌ వచ్చింది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కుంభకోణం కేసులో గతేడాది సెప్టెంబర్‌ లో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యాడు. 52రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. ఆయన ఇటీవల మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే భాగ్యం దక్కింది.

తీహార్‌ జ్కెలులో కవిత 150 రోజులు :

ఢల్లీి లిక్కర్‌ కేసులో కవితకు పలుమార్లు ఈడీ, సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికి లెక్కచేయలేదు. ఆ పని ఉంది, ఈ పని ఉందంటూ దాటవేస్తూ వచ్చింది. ఇక చేసేందేం లేక మార్చి 15వ తేదీన 12 మందితో కూడా ఈడీ అధికారుల బృందం హైదరాబాద్‌ కు చేరుకుంది. మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోదాలు జరిపి పీఎంఎల్‌ఏ యాక్ట్‌ సెక్షన్‌ 19 కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ తెలిపింది. మార్చి 15వ తేదీన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్‌ చేయగా నేటికి 150 రోజులుగా ఆమె తీహార్‌ జ్కెలులో ఉంది. జైలుకు వెళ్లిన వారే సీఎం అయ్యారు అనే విషయానికొస్తే… ఇప్పుడు కవితక్కకు ఛాన్స్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మాజీ సీఎం కూతురు కావడం, బీఆర్‌ఎస్‌లో గతం లో కీలక భూమిక పోషించడం తెలంగాణ రాకముందే జాగృతి సంఘం నడిపిస్తూ ఊరు వాడ మహిళలందర్నీ ఏకం చేసింది. దేశ, విదేశాల్లో తిరుగుతూ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయం చాటు తూ మన విశిష్టతను తెలియజెప్పింది. ఇదీట్లా ఉంటే రాష్ట్రం ఏర్పడ్డాక తొలి, మలిముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అయ్యారు. అయితే రెండోసారి తన కొడుకు మాజీ మంత్రి కేటీఆర్‌ ను సీఎంను చేయాలనే ఆశపడ్డాడు. కానీ ఆ అవకాశం దక్కకుం డానే పోయి ంది. మూడోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వస్తే కొడుకును తప్పక ముఖ్యమంత్రినీ చేయాలనే కలలు కన్నాడు కానీ అదీ కలగానే మిగిలిపోయింది. నెక్ట్స్‌ అయినా ఆ ఛాన్స్‌ వస్తుందా అని ఎదురుచూస్తున్న కేటీఆర్‌కు గట్టిషాక్‌ తగలనుందని తెలు స్తోంది. ‘శత్రువులు ఎక్కడో ఉండరు రా.. ఇంట్లోనే చెల్లెల్లు, కూ తుర్ల రూపంలో మారువేశాలు వేసుకొని మన కొంప లోనే తిరు గుతూ ఉంటారు’ అనే ఓ సినిమా డ్కెలాగు గుర్తొస్తే కేటీఆర్‌ కు కవిత రaలక్‌ ఇచ్చేలా అనిపిస్తోంది. సారా దందా కేసులో జైలు కెళ్లిన కేటీఆర్‌ చెల్లె కవితనే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పలువురురాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ముఖ్యమంత్రి కావాలంటే జైలుకు పోవాల్సిందే అన్న మాట నిజం అయితే తెలంగాణకు నెక్ట్స్‌ సీఎం కవితనే. లేదంటే అవన్ని ఒట్టి మాటలే అని.. ఏదో ఒకటి తేలిపోనున్నాయి.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This