దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి. యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత కాలం యుద్ధం చేయటం అందరిని ఆశ్యర్య పరుస్తోంది.రెండు దేశాలలో నష్టం ఇరువురికి వచ్చినా రష్యా తో పోల్చుకుంటే ఉక్రైన్ కు భారీ నష్టం కలిగింది.యుద్ధంలో మిలిటరీ సిబ్బందిని చాలా పోగొట్టుకుంది.సైనికుల నష్టం అపారంగా ఉంది.ఇప్పుడు రష్యాతో యుద్ధం చేయాలంటే సైనిక సిబ్బంది కొరతతో ఉక్రైన్ అల్లాడుతూ ఉంది. రష్యాతో రాజీ చేసుకుందామనే ఆలోచన దానికి లేదు.యుద్దానికే మొగ్గు చూపుతోంది.
యుద్ధంలో సైనికులను ఉక్రైన్ ఎక్కువ సంఖ్యలో పోగొట్టుకోవడంతో తాజాగా ఓ వినూత్న ఆలోచన చేసింది.అదేమిటంటే వివిధ నేరాలు చేసిన నేరస్తులు ఉక్రైన్ కారాగారంలో మగ్గుతున్నారు.వారిలో కొందరిని యుద్దానికి వాడుకోవాలని,వారికి శిక్షణ ఇచ్చి రంగం లోకి దించాలని ఖైదీలకు తెలిపింది.మీ నేరాలు కొట్టి వేస్తాం.మీరు దేశానికి కావాలి.మీరంతా విడుదలయి దేశ పరిరక్షణకు అంకిత భావంతో పని చేయాలి అనే ప్రతి పాదన తెచ్చింది.దీనికి ఖైదీ లనుంచి మంచి స్పందన వచ్చిందని భోగట్ట.అయితే నేరస్తులలో అత్యాచారం, హత్య చేసిన వాళ్ళు అనర్హులుగా ప్రకటించింది. ముందస్తుగా మూడువేలకు పైగా ఖైదీలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని వారికి శిక్షణ ఇవ్వాలనే ఆలోచన. శిక్షణలో వారికి గన్ ఎలా పట్టుకోవాలి, యుద్ధరంగంలో నైపుణ్యంగా ఎలా కదలాలి తదితర అంశలపై శిక్షణ ఇవ్వాలని తలంచింది. వీరందరిని త్వరలో యుద్ధరంగంలోకి దించవచ్చు.ఖైదీలను సైన్యంలో చేర్చాలనే బిల్లును కూడ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. వీటి తర్వాత మరో సారి దాదాపు ముప్పై వేల మందిని సైనికులుగా తీసుకోవాలని, నియామకపు ప్రక్రియ వేగవంతం చేసింది. అందు నిమిత్తం ఖైదీలకు మౌఖిక ఇంటర్వ్యూ కూడ చేపట్టింది. ఇప్పుడు ఖైదీలు మాపై కేసులు సమాసిపోతాయి దేశ రక్షణకు మేము సిద్ధమనే సాంకేతాలు ఇస్తున్నారు.అయితే వీరందరు స్వయంగా ముందుకు వచ్చారా,లేకపోతే బలవంతంగా చేర్చుకుంటున్నారా అనేది స్పష్టంగా తెలీదు.కొందరిలో ఉత్సాహం,కొందరిలో నిర్వే దం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఉక్రైన్ కొత్త ఆలోచన బట్టి చుస్తే యుద్ధం కొనసాగే ధోరణి కనపడతావుంది. ఎంత శిక్షణ ఇచ్చినా వారిలో అంత శక్తి సామర్థ్యలూ ఉండవని తోస్తోంది.ఇలా దేశం కోసం ఖైదీలను ఉపయోగించుకోవడం యుద్ధ చరిత్రలోనే ప్రధమం. అన్ని దేశాలు చాలా వరకు యుద్ధం ఆగిపోవాలి అనే కోరికతోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రష్యా, ఉక్రైన్ రాజీ ధోరణి పాటిస్తే మేలు ఇదే అందరూ కోరుకుంటున్నారు.మరి ఎవరు ముందు రాజీ పాటిస్తారో, రాజీ చేయరానికి ఏ దేశం ముందుకు వస్తుందో వేచి చూద్దాం.ఖైదీలను యుద్దానికి పంపుతుంది అంటే ఉక్రైన్ ఏ మేరకు సైనికులను నష్టపోయిందో అర్ధం చేసుకోవచ్చు.ఇది రష్యాకు కూడ కలసి వస్తుంది.దాడులు వేగవంతం చేయవచ్చు.రష్యా, ఉక్రైన్ ను ఆక్రమించుకోవాలనే తలంపు తోనే ఉంది.ఎవరిది గెలుపొ కొద్ది రోజులలో తేలిపోతుంది.
లేకపోతే యుద్ధం దీర్ఘాకాలం కొనసాగుతుందో వేచి చూడాలి.యుద్ధం కొనసాగకూడదు అనే శాంతి ప్రేమికులు కోరుకుంటున్నారు. శాంతే కావాలని మనమందరం కోరుకుందాం.
కనుమ ఎల్లారెడ్డి,
తాడిపత్రి,
9391523027.