మన దేశంలో, రాష్ట్రంలో
చట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి!
ఒక వ్యక్తి నిరు(పేద)ద్యోగిగా ఉండటం
అతడు /ఆమె తప్పు కాదు?
మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కి
ఉపాధి చూపని పాలకులది ఆ తప్పు!
ఉద్యోగ,ఉపాధి కల్పన “సార్వత్రిక హక్కుగా”
పార్లమెంటులో చట్టం చేయాలి
రాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలి
ఏ నిరుద్యోగి యాచకుడు కాదు?
జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత
కుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనా
నిరు(పేద)ద్యోగ పెనుభూతాన్ని
దేశం నుండి తరిమివేయాలి
చర్చ జరగాల్సింది దీనిపైన కదా!
పాలకులారా యువశక్తిని నిర్వీర్యం చేస్తే?
దేశం విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది!
ఆ తర్వాత కాయకల్ప చికిత్స చేస్తే
మరణానంతరం మందు ఇవ్వడం లాంటిదే?
మొద్దు నిద్ర వీడండి..
మేదాజీ