- ఆసక్తి కామెంట్స్ చేసిన పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్
పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని,విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇస్లామాబాద్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఇషాక్ తాము భారతదేశంతో శాశ్వత శత్రుత్వం కోరుకోవడం లేదని,ఈ విషయంలో భారత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.పొరుగు దేశాలతో పాకిస్థాన్ మంచి సంబంధాలే కోరుకుంటుందని తెలిపారు.పాకిస్థాన్ శాశ్వత శత్రుత్వాన్ని ఎప్పుడు విశ్వాసించదాని అన్నారు.భారత్ తో నిర్మాణాత్మకమైన చర్చలను పాకిస్థాన్ కోరుకుంటుందని,భారత్ ఏకపక్ష నిర్ణయాలను పాకిస్థాన్ అంగీకరించదాని పేర్కొన్నారు.