- చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం
- విలాసాల కోసం కొంతమంది చెరువుల్లో ఫామ్ హౌస్ లు నిర్మించారు
- హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉంది
- ఆక్రమణదారుల నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం
- అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,కొంతమంది వారి విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌస్ లు నిర్మించారని మండిపడ్డారు.ఎంత ఒత్తిడి ఉన్నా అక్రమ నిర్మాణాలను కూలగొడతామని స్పష్టం చేశారు.శ్రీ కృష్ణుడి భగవద్గిత బోధనానుసారం చెరువులను కాపాడతామని తెలిపారు.హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు.
కొంతమంది చెరువుల పక్కన ఫామ్ హౌస్ లు నిర్మించి,ఆ ఫామ్ హౌస్ ల నుండి వచ్చే నీరును చెరువుల్లోకి వదులుతున్నారని వ్యాఖ్యనించారు.భవిష్యత్తు తరాల కోసమే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని తెలిపారు.ఆక్రమణదారుల నుండి చెరువులకు విముక్తి కలిగిస్తామని స్పష్టం చేశారు.అధర్మం ఓడలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు నాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.రాజకీయం కోసం కానీ,కక్షసాధింపుల కోసం కానీ కూల్చివేతలు చేయడం లేదని అన్నారు.