Friday, September 20, 2024
spot_img

డిసెంబర్ 09న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు మనసు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.బుధవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నా అదృష్టమని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని,పదేళ్లు తెలంగాణ తల్లిని మరుగున పడేశారని విమర్శించారు.ప్రగతి భవన్ చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని సామాన్యులకు రానివ్వలేదని మండిపడ్డారు.కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మార్చి సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

డిసెంబర్ 09న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని,ఆరోజు తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు.దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This