Tuesday, September 9, 2025
spot_img

స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్ జీరో సిటీలో స్కిల్ యూనివర్సిటీ,హెల్త్ హబ్,ఎడ్యుకేషన్ హబ్ తోపాటు స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్ కార్యక్రమాలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు.శాసనసభ్యులు కూడా క్రీడాస్ఫూర్తిని చాటుకునేలా ఇకపై ప్రతి బడ్జెట్ సెషన్ లో కార్యక్రమాలు నిర్వహించే సంప్రదాయాన్ని పునరుద్ధరించే అంశంపై అఖిలపక్షంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This