ఏ ఒక్కరోజు కూడా రోశయ్య పదవుల కోసం పోటీ పడలేదని, అయిన ప్రతిభను చూసి పదవులే అయిన వద్దకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోశయ్య నిబద్ధత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైందని తెలిపారు. రోశయ్యలా సమస్యను పరిష్కరించే నాయకుడు తెలంగాణ శాసనసభలో లేరన్న లోటు కనిపిస్తుందని అన్నారు.పార్టీ కోసం రోశయ్య ఎంతో నిబద్ధతగా పనిచేశారని,ట్రబుల్ షూటర్ గా రోశయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు.
2007లో నేను శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నప్పుడు రోశయ్య నాకు కొన్ని సలహాలు,సూచనలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇరిగేషన్ శాఖపై బాగా మాట్లాడుతున్నానని నన్ను ప్రోత్సహించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రోశయ్య నిఖార్సైన హైదరాబాది..అయిన విగ్రహం హైదరాబాద్లో లేకపోవడం లోటే..తప్పకుండా హైదరాబాద్ లో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.