Sunday, November 24, 2024
spot_img

జనాభా లెక్కలు తెల్చేది ఎప్పుడు?

Must Read

దేశ అభివృద్ధికి కావలసిన మానవ వనరులను అందించడంలో దేశ జనాభా బహుముఖ పాత్ర పోషిస్తుంది. జనగణన చట్టం ప్రకారం భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు.ప్రతి పది ఏళ్ళకు ఒక సారి లెక్కించే జనాభా లెక్కల సేకరణ.వల్ల జనాభా ఎంత మేరకు పెరిగిందో తెలుసుకోవచ్చు. జన గణన ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అభివృద్ధి ప్రణాళిక, అభివృద్ధి పథకాలు ప్రాజెక్టుల నిర్మాణం విద్య వైద్య రంగాల అభివృద్ధి పథకాలు, ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుంది. జనాభా లెక్కలు సకాలములో చేపట్టక పోవడం వల్ల పేదరికం’ నిరుద్యోగం’ ప్రాంతీయ అసమానతలు ‘ఆర్థిక అసమానతలు ఆదాయ అసమానతలు స్త్రీ ‘పురుష అసమానతలు ‘లింగ వివక్ష ‘బాల కార్మికులు ‘ శ్రామికుల వలస వికలాంగుల సంక్షేమం మున్నగు సమస్యల పరిష్కారం పై ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఉంటుంది. జనాభా పెరిగిన దేశం (నిష్పత్తిలో) ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెరగక పోవడం వల్ల రాజ్యాంగ లక్ష్యమైన ఆర్థిక న్యాయం పంపిణీ న్యాయం ఎండమావిగానే మారింది. జాతీయ శాంపిల్ సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆర్థిక సర్వే మొదలగు కీలక అధ్యయనాలకు జనాభా లెక్కలు కీలకం అయినప్పటికీ జనాభా గణన 3 యేళ్లు ఆలస్యమైంది.

కరోనా మహమ్మారి కారణంగా జనాభా లెక్కల సేకరణ ఆలస్యమైంది. పరిస్థితులు చక్కబడినప్పటికి కేంద్ర ప్రభుత్వం జనాభా గణన పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం జనాభా గణన నిర్వహణ పట్ల స్పష్టత ఇవ్వడం లేదు. జనాభా లెక్కలను వాయిదా వేయడం మీద చూపించే శ్రద్ధ నిర్వహణ పట్ల దృష్టి పెట్టని స్థితి నెలకొనడం వల్ల ప్రజా సంక్షేమం అటకెక్కింది.

జనాభా గణన _ చరిత్ర

మన దేశంలో బ్రిటిష్ వారు తొలి జన గణన 1881 సం” లో నిర్వహించారు. బ్రిటిష్ వాళ్ళ పాలన కాలంలో దేశంలో కొన్ని విపత్తులు సంభవించినప్పటికి జనాభా గణన వాయిదా పడలేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జనాభా లెక్కలు సేకరించారు .వాయిదా వేయలేదు. దేశంలో 1918 లో దేశవ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ ఏర్పడి ప్రజారోగ్యం దెబ్బతిన్న జనగణన ఆగిపోలేదు. 1921 లో రిజిస్ట్రార్ జనరల్ జనాభా లెక్కల కమిషనర్ కార్యాలయం జన గణన సకాలములో పూర్తి చేసింది. 1947 లో దేశ విభజన జరిగి పాకిస్థాన్ భారత దేశంగా విడిపోయినప్పటికీ జనాభా లెక్కలు ఆగిపోలేదు. బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికార బదిలీ గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ 1951 లో జన గణన యదా విధంగా జరిగింది.

జనాభా లెక్కలు సేకరణ నిర్వహణకు ఒక సంవత్సరం ముందు నుండే ప్రణాళికలు రూపొందించి ఆ ప్రణాళిక ప్రకారం 2020 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య దేశం లోని అన్ని గృహాలకు వెళ్లి గృహాల లో నివాసం ఉంటున్న వ్యక్తుల వివరాలు సేకరించి తర్వాత సంవత్సరం ఫిబ్రవరిలో దేశము లోని మొత్తం జనాభా లెక్కిస్తారు కాని దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల జన కదలిక మీద విధించిన నిబంధనలు అమలు వల్ల జనాభా గణన వీలు పడలేదు. కరోనా అనంతరం జనాభా గణన వాయిదా పడుతూనే వుంది. గతంలో జనాభా గణన సరిగ్గా జరుగలేదని సేకరించిన వివరాలు కచ్చితంగా లేవని జనాభా గణన కొత్త పద్ధతిలో చేపడతామని నూతన సాంకేతిక ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేపట్టనున్నట్లు దేశ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు ఈ సారి జనాభా గణనలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా 35 కంటే ఎక్కువ సామాజిక ఆర్థిక కొలమానాల ఆధారంగా జనాభా లెక్కలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జన గణన ఆధారంగా జనాభా రిజిస్టర్ ఎలక్టోరల్ రోల్ రిజిస్టర్ ‘ఆధార్ కార్డు రేషన్ కార్డు ‘పాస్ పోర్ట్ ‘ డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన వివరాలను డాటాను అప్డేట్ చేసి నవీకరించడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం గమనార్హం.దేశంలో 2024 న లోకసభకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి .ఎన్నికల వల్ల జనాభా లెక్కల సేకరణ చేపట్టే అవకాశాలు లేవు. దేశంలో లోక్ సభ ‘రాష్ట్ర విధాన సభల్లో మహిళా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ జనగణనలో కుల గణన చేపట్టాలని డిమాండ్ బలంగా వున్నందున 2027 లో జరిగే జనాభా లెక్కల్లో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

జనాభా లెక్కల ప్రకారం లోకసభకు రాష్ట్ర విధాన సభలకు ఎస్సీ ‘ఎస్టీ ‘మహిళా’ బి’సి రిజర్వేషన్ నిర్ధారించడం లోక్ సభ ‘విధాన సభ నియోజక వర్గాల పరిధిని నిర్ణయించడం జరుగుతుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ప్రవేశ పెట్టే వార్షిక బడ్జెట్ లో ఎస్సీ ఎస్.స్టీల బీ.సీ ల సంక్షేమానికి వ్యవసాయ ” పారిశ్రామిక ‘ సేవా రంగాలకు నిధుల కేటాయింపు జనాభా నిష్పత్తి ప్రకారం చెయ్యాలి .జన గణన తో ఆర్థిక వ్యవస్థలో వృధి’ అభివృద్ధి స్థాయిలను అంచనా వేయవచ్చును. దేశంలో వెనుక బడిన ప్రాంతాలు పర్వత ప్రాంతాల ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం జనాభా గణన దిక్సూచి లాగా పనిచేస్తుంది..

ప్రభుత్వం జనాభా లెక్కలను నిర్దిష్ట కాలంలో నిర్వహించకపోవడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి.దొంగ ఓట్ల బెడద ప్రభుత్వం జనాభా లెక్కలను సకాలంలో నిర్వహించి వుంటే జనాభా జాబితా తో ఓటర్ల జాబితాను సరిచుకునేది. దీని వల్ల దొంగ ఓటర్ల బెడద నమోదును అడ్డుకునే అవకాశం ఉండేది. దేశవ్యాప్తంగా అనేక నియోజక.వర్గాలలో ఒకే ఓటరు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల నియోజక వర్గాలలో ఓటర్లుగా నమోదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో నకిలీ ఓటర్లు అధిక సంఖ్యలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఇంటి నెంబర్ “నో ” అనే పేరు మీద వందల ఓటర్లు నమోదు అయినట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు నకిలీ ఆధార్ కార్డులు పెరిగి పోతున్నాయి. ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జన్ దన్ ఖాతాలు ఆధార్ కార్డుతో అనుసంధానించడం వల్ల అనేక ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ప్రయోజనాలు అసలు లబ్ధిదారులకు అందడం లేదు. నకిలీ వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో జనాభా లెక్కలు సేకరిస్తే ఇలాంటి నష్టాలను అరికట్టవచ్చును. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అటవీ కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఆధార్ కార్డ్ ను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా వున్న వారిని అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగస్వాములను చేయాలంటే జనాభా లెక్కలు సేకరించాలి.

ఇప్పటికీ దేశంలో 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేయడం వల్ల 10 కోట్ల మంది అసలైన లబ్దిదారులు నష్ట పోతున్నారు ఒక అధ్యయనంలో వెల్లడైంది. జనాభా గణన ఆలస్యం అయితే కోట్లాది లబ్ది దారులు నష్టపోయే ప్రమాదం వుంది. ప్రభుత్వం త్వరిత గతిన సకాలములో జనాభా లెక్కలు పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి. జనగణన పైననే జన సంక్షేమం అభివృద్ధి ఆధారపడి వుంది.

(ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా)

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్ 9440245771

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS