- సర్కారు వైద్యాశాలల్లో డైటిషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
- వైద్య విద్యాశాఖలో పదేళ్లు తిష్టవేసిన డీడీ శ్రీహరిరావు
- ఏళ్లుగా అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ హరికళ
- ప్రమోషన్లు అడ్డుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు
- ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు వినికిడి
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైటిషియన్స్ కు నో ప్రమోషన్స్
తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెనూ సక్కగుండట్లేదు. ‘అన్నం పెట్టే వాడికన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువ’ అన్న చందాన.. కొందరూ అధికారులు చేయబట్టి డైటిషియన్ల రిక్రూట్మెంట్ కావట్లేదు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ డీఎంఈ ఆఫీసులో డీడీ శ్రీహరిరావు గత 10 ఏళ్లుగా తిష్టవేసి కూర్చున్నారు. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ హరికళ అక్కడ్నే కూర్చున్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో వైద్యవిద్యశాఖలో అనేక అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దల ఫుల్ సఫోర్ట్ తో శ్రీహరిరావు ఏళ్లుగా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఏ విధమైన ప్రమోషన్లు జరగకుండా ఉన్నతాధికారులను పక్కత్రోవ పట్టిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డీడీ శ్రీహరిరావు, సీనియర్ అసిస్టెంట్ హరికళ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు గత ప్రభుత్వ పెద్దల అండదండలతో డీఎంఈలో ఒకే స్థానంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీహరిరావు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో పనిచేసే సూపరింటెండెంట్ ప్రస్తుతం సస్పెన్షన్ కు గురి అయిన సల్లావుద్దీన్ భార్య అయినటువంటి హరికళ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. ఏ విధమైన ప్రమోషన్స్ డైటీషియన్స్, బయోకెమిస్ట్రీ, లైబ్రేరియన్ ఇవ్వకుండా జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో అనగా 2013 లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే డైటిషియన్స్ ప్రమోషన్స్ ఇచ్చారు. గత 10 ఏళ్లుగా ఆ ఖాళీలను భర్తీ చేయకుండా ఫుడ్ కాంట్రాక్టర్లతో కుమ్ముకై అయినట్లు ప్రచారం అవుతుంది. అందుకోసం జీవో ప్రకారం సర్వీసులో ఎవరైనా అర్హత కలిగిన ఉద్యోగస్తులు ఉంటే వారికి ప్రమోషన్ ఇవ్వమని చెప్తున్నా ఏదో ఒక సాకుతో ప్రతి సంవత్సరం ఉద్యోగస్తులకు కాల్ ఫర్ చేయటం, ప్రొవిజనల్ సీనియార్టీ లిస్ట్ ఇవ్వటం, దానిని ఫైనల్ చేయకుండా ప్యానెల్ ఇయర్ దాటవేయటం జరుగుతుంది. ఉద్యోగస్తులు వారి యొక్క జెన్యూనిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పటికీ మీ సర్టిఫికెట్స్ సరైనవి కావు అని దుర్భాషలాడటం జరుగుతుంది.
అత్యున్నతమైన వైద్యవిద్యా కోర్సుని పర్యవేక్షించే డీఎంఈ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ యూనివర్సిటీకి సంబంధించి సర్టిఫికెట్స్ ఏవి సరైనవో, ఏవి సరి సరైనవో కావో తెలుసుకోకుండా జాప్యం చేస్తున్నారు. ఈ విధమైన ప్రవర్తనతో గత 10 ఏళ్లుగా ఉద్యోగులను ఇబ్బందు పెడుతూ ప్రమోషన్స్ ఇవ్వకుండా కాలయాపనా చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. స్వయానా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చిన, ప్రిన్సిపల్ సెక్రటరి చెప్పినా, స్వయానా డీఎంఈ చెప్పినా వారిలో ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
జీవో నెం.152 ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు (సబార్డినేట్ సర్వీసెస్) పి.జి. డిప్లొమా ఇన్ న్యూట్రిషియన్ మరియు డైటేటిక్స్‌లో కలిగివుంటే ఆలాంటి వారికి ప్రమోషన్ ఇవ్వడానికి అర్హులుగా జీవోలో స్పష్టం చేయడం జరిగింది. గతంలో 152 జి.ఓ. ప్రకారం సమాన అర్హత కలిగినటువంటి వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. వారు ఇప్పుడు చీఫ్ డైటిషన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రతిసారి వైద్య ఆరోగ్య శాఖలో దరఖాస్తు పెట్టుకొని సమాన విద్యా అర్హతలు కలిగి యున్నప్పటికీ ప్రమోషన్ ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టడడమే కాకుండా, గతంలో ప్రమోషన్ పొందిన వారు కూడా అదే విద్యార్హతతో ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి సర్టిఫికెట్స్‌పై ఎలాంటి వివాదం లేకుండా వారికి కొమ్ముకాస్తున్నారు.
గత 10 సం||లుగా యం.జి.యం. ఆసుపత్రి వరంగల్ (1250 బెడ్లు), ఆదిలాబాద్ రిమ్స్ (750 బెడ్లు), నిజామాబాద్ ఆసుపత్రిలో (450 బెడ్లు) పెట్ల బురుజు ఆసుపత్రి, హైద్రాబాద్ ఫీవర్ హాస్పిటల్, సరోజిని కంటి దవాఖానా, చెస్ట్ హాస్పిటల్ హైద్రాబాద్, యం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్ హైద్రాబాద్, కోటి మెటరినటి హాస్పిటల్, మహబూబ్‌నగర్ ఆసుపత్రి, అదే విధంగా కొత్తగా వచ్చిన అన్ని మెడికల్ కాలేజీల్లో దరిదాపు 36 పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా, అర్హత కలిగిన ఉద్యోగస్తులు ఆఫీసు చుట్టు తిరుగుతున్న పట్టించుకోకుండా, ఆసుపత్రులలో అపరిశుభ్ర వాతావరణంలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా నడుస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పర్యవేక్షించాల్సిన వైద్య, విద్య సంచాలకులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావీస్తుంది. ప్రభుత్వ హాస్పట్‌లో డైటీషన్ లేక హైప్రోటిన్ డైట్ పేషెంట్లకు అందడం లేదు. అంతేకాకుండా హై ప్రోటిన్ డైట్ ఇవ్వకున్న, పేషంట్లకు ఇస్తున్నట్లు డైట్ కాంట్రాక్టర్లు బిల్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ సమయంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కావటం, రిటైర్మెంట్ కు దగ్గరగా ఉండటం వల్ల ఆందోళన చెందుతున్నారు. కావున ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు స్పందించి డిప్యూటీ డైరెక్టర్ శ్రీహరిరావు, హరికళలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగస్తుల నుండి డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ ఏడాదైనా డైటిషియన్స్ ప్రమోషన్స్ ఇప్పించి ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలకు అందించే ఆహారంలో పర్యవేక్షణ సరిగా ఉండే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు.
డీడీ శ్రీహరిని ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా, డైటిషన్ల ప్రమోషన్లకు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తాం.. నాపైన కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. చట్టానికి లోబడే విధులు నిర్వర్తించడం జరుగుతుంది.