- ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి
- ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది
- గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి
- ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు
ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాలనలో యువత ఆందోళనకు గురవుతున్నారని,వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గ్రూప్ అభ్యర్థులు పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్న వారి డిమాండ్ల పై ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు.జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వాలని కోరారు.1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇస్తే ఎంతో మంది ఎస్సి,ఎస్టీ,బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్న ఇప్పటివరకు ఆరుగ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు.కెసిఆర్ ప్రభుత్వ హయంలో గడువు తప్పకుండా పెన్షన్ వచ్చేదని,గత రెండు నెలల నుండి పెన్షన్ రావడం లేదని పేర్కొన్నారు.తక్షణమే పెండింగ్ లో ఉన్న పెన్షన్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది,ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.