Saturday, August 23, 2025
spot_img

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం

Must Read
  • తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కారు ప్రమాదాలు

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి, కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటనల్లో కారులో వెళ్తున్న వారు కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్‌ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సమయంలో మూడు మృతదేహాలు కారులో ఇరుక్కున్నాయి. వాటిని తీసేందుకు అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమిచారు. దారి కనిపించకపోవడం అతివేగమే ఈప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పి పెట్రోల్‌ బంక్‌ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్‌ జంక్షన్‌ సిఐ అల్లు లక్ష్మీ నరసింహమూర్తి, వీరవల్లి ఎస్‌ ఐ చిరంజీవి తన పోలీసులు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కొవ్వూరు నుంచి తమిళనాడు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా చెబుతున్నారు. మృతుల వివరాలు స్వామినాథన్‌ (40), రాకేష్‌ (12 ) రాధప్రియ(14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్‌ భార్య) తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడలో కూడా ఓ కారును బస్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దురు స్పాట్‌లోనే చనిపోయారు. వీళ్లంతా విజయనగరం వాసులుగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS