- అధికార నాయకులు హవా.. బొగ్గు పెళ్లా దాటాలంటే మామూలు కట్టాల్సిందే.
- బాడీ బండ్లు, టిప్పర్ బండ్లకు రూ 1000 వరకు వసూళ్లు.
- మామూలు చెల్లించకుంటే లోడింగ్ లేనట్టే..
- అధికారం మారినప్పుడల్లా దందాలో మార్పు
కోయగూడెం ఉపరి తల గనిలో కోల్ మాఫియా కోరలు చాచుకుంది.. అధికారం మాటన మాఫియా కట్టలు తెంచుకుంటుంది.. నల్ల బంగారాన్ని శాసిస్తూ ఉపరితల గనిని తమ కబంధహస్తాల్లో కబ్జా చేసుకుంది.. తాము చెప్పిందే వేదం చేసేది శాసనం అన్నట్లుగా కోల్ మాఫియా రెచ్చిపోతుంది. అధికారంలో ఎవరు ఉంటే వారు ఈ ఉపరితల గనిని శాసించడం ఆనవాయితీగా మారుతుంది. సింగరేణి నిబంధనలకు విరుద్ధంగా కోల్ మాఫియా హద్దు అదుపు లేకుండా అక్రమార్జనకు ఒడి కడుతుంది. లారీ ట్రాన్స్‌పోర్ట్‌ల నుంచి కోట్లాది రూపాయలను దండుకుంటుంది. తాము చెప్పిన డబ్బులను చెల్లించుకుంటే లారీల ద్వారా వెళ్లే బొగ్గును అడ్డుకుంటుంది. కాదని ఎవరైనా ఎదిరిస్తే వారి అధికార బలంతో బెదిరింపులకు పాల్పడుతుంది. సింగరేణి సంస్థ కోయగూడెంలో నిత్యం వందలాది లారీలు ఇతర ప్రాంతాలకు బొగ్గును రవాణా చేస్తుంటాయి. టెండర్ల ద్వారా బొగ్గును తగ్గించుకున్న ట్రాన్స్‌పోర్టు ఏదేచ్ఛగా బొగ్గును రవాణా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ. కోల్ మాఫియా చేస్తున్న అరాచకాలు అడ్డుకోలేక పోతుంది. డబ్బే లక్ష్యంగా కోల్ మాఫియా రెచ్చిపోతుంది. ఒక విధంగా ఇల్లందులో జరిగే శాసనసభ ఎన్నికలకు సంబంధించి కోయగూడెం మాఫియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పాలి. కోయగూడెంలో జరుగుతున్న కోల్ దందాకు సంబంధించి గతంలో ఎన్నో గొడవలు సైతం జరిగిన విషయం విధితమే. ఉపరితల గనిలో ఆధిపత్యం కోసం చంపుకునేందుకు సైతం జరిగిన సంఘటనలు తెలిసిందే. కోయగూడెం కూల్ మాఫియాకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధియే నాయకత్వం వహించడం దుర్మార్గమైన చర్యగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచింది తరువాయి డబ్బులకు ప్రధాన వనరుగా ఉన్న కోయగూడెంలో మాఫియా ముఠాను ఏర్పాటు చేసి బొగ్గు ట్రాన్స్‌పోర్ట్‌లో ఒక్కొక్క లారీకి రూ.1000 వరకు అక్రమంగా వసూలు చేస్తూ కోట్లను గడిస్తున్నారు. ఈ డబ్బులు వసూలుకు ఓ మాఫియా ముఠాగా ఏర్పడి లారీ ట్రాన్స్‌పోర్ట్‌లను బెదిరిస్తూ డబ్బులను దోచుకుంటుంది. మాఫియా చెప్పినట్లుగా డబ్బులు చెల్లించకుంటే బొగ్గు లోడింగ్ లో సైతం నిలిపివేసి నాన్న ఇబ్బందులకు గురి చేస్తుంది. అమాయకు లారీ యాజమాన్లు మాఫియా ఆగడాలను అడ్డుకట్ట వేయలేక చెప్పుకునే దిక్కు లేక అక్రమార్కులకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత తంతు జరుగుతున్న ప్రశ్నించేవాడు లేకపోవడంతో మాఫియా కు ఎదురు చెబితే ఏం చేస్తారు అని భయంతో బిక్కుబిక్కు అంటున్నారు.
ఒక్కోలారికి రూ. వెయ్యి వసూలు…
సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో కూల్ మాఫియా ముగ్గు రవాణా లెప్ట్ ఒక్కో లారికి రోజుకి రు. 1000 చెల్లించాలని నిబంధన పెట్టింది. కోయగూడెం నుంచి రోజువారీగా సీజన్‌లో 200 నుంచి 300 లారీలు, అన్ సీజన్లో 100 లారీల వరకు ఇతర ప్రాంతాలకు బొగ్గును రవాణా చేస్తుంటారు. ఇలా రోజుకు ఒక్కో లారీ చొప్పున 1000 రూపాయలు చెల్లించాల్సిందే. ఒకవేళ కాదని వ్యతిరేకిస్తే కోల్ మాఫియా ఆ లారీకి లోడింగ్ కాకుండా చూస్తారు. ఇలా కోయగూడెం ఇప్పుడు తెలగని మాఫియా కు సిరులు కురిపించే గనిగా మారింది. ఇంత దంత జరుగుతున్న మాఫియా ఆగడాలకు అడ్డు కట్టలేకుండా పోతున్న పోలీసులు సింగరేణి అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కోల్ మాఫియా ఆగడాలకు సంబంధించి సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారని సమాచారం. సాక్షాత్తు ఈ కోల్ మాఫియా కు సంబంధించి కర్త కర్మ క్రియ నియోజకవర్గ బాస్ వహిస్తున్నాడని విషయం ఇప్పటికే జిల్లాలోని కీలక మంత్రి దృష్టికి సైతం వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా కోల్ మాఫియాను అరికట్టాలని లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, లారీ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.