- ఆనంద హోమ్, పూజా నిర్మాణాలు పరిశీలన..
- చట్టవ్యతిరేకమైన ఎంత పెద్ద నిర్మాణాలు అయినా కూలుస్తాం..
- బఫర్ జోన్, ఎఫ్‌టిఎల్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నంపూర్ పెద్ద చెరువు బఫర్ జోన్ లో నిర్మాణం చేసిన లేక్ వ్యూ విల్లాస్‌ని హైడ్రా(HYDRA) స్పెషల్ టీం శుక్రవారం నాలుగు విల్లాలు కూల్చి వేశారు. ఈనెల గురువారం రోజు హైడ్రా కమిషనర్ రంగానాధ్ పరిశీ లించి లేక్ వ్యూ విల్లాలు బఫర్, ఎఫ్ టి ఎల్ లో ఉన్నవని గుర్తించి కూల్చివేతకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం సిబ్బందితో కూల్చివేతలు చెప్పట్టారు. అలాగే పూజ, ఆనంద హోమ్ ని కూడా పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఆ నిర్మాణాలు కూడా బఫర్ జోన్ లో ఉన్న సంగతి గుర్తించారు. సర్వే పూర్తిగా హైడ్రా నుండి చేసి గతంలో చేసిన సర్వే తప్పుడు తడకలు గా ఉన్న సందర్భంగా హైడ్రా టీమ్ సర్వే చేసి ఆనంద హోమ్ లో ఎక్కడ వరకు బఫర్ జోన్ వస్తుంది గమనించి అక్కడ వరకు చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా నిజం నిప్పులాంటిది ఏ రోజు అయినా బయటకు వస్తుంది. పుప్పాల గూడలోని పద్దెనిమిది ఎకరాలపై కూడా ప్రభుత్వం భూమి ఎక్కడ ఉన్నదని పరిశీలిస్తున్నారు. మండల్ సర్వేయర్ గణేష్ గతంలో అవినీతి నిరోధక అధికారులకు పట్టు పడిన సంగతి విదితమే. అలాంటి అవినీతి అధికారి ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఎంత క్లారిటీ గా ఉంటుందో అందరికీ అర్థం అవుతుంది అని హైడ్రా స్పెషల్ టీమ్ సర్వే నిర్వహించి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకునే యోచనలో హైడ్రా ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఆనంద హోమ్, పూజా నిర్మాణాలు మణికొండ మున్సిపల్ పుప్పాల గూడ, నర్సింగ్ మణికొండ మున్సిపాలిటీ కలుపుకొని మరో నిర్మాణం అగమ్యగోచరంగా ఉన్నది అని స్థానికులు తెలిపారు.