Wednesday, January 15, 2025
spot_img

కావ్య కబ్జాల సంగతేంటి.?

Must Read
  • జ‌వహర్‌న‌గర్ మాజీ మేయర్ భూ కాబ్జాల‌పై హైడ్రా స్పందించేనా.?
  • ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెకాయ రాజ్యంలో ఎక‌రాలు గ‌యాబ్‌
  • గత సర్కార్ హయాంలో ప్రభుత్వ స్థలాలు మాయం
  • అందమైన గెస్ట్ హౌస్ లు పుట్టుకొచ్చిన వైనం
  • నాలుగు కోట్లకు మేయర్ పదవి..
  • ఫలితంగా ఐదు ఎకరాలు కబ్జా పెట్టిన మాజీ మేయర్
  • అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాల పర్వం

గత బీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని కబ్జాలు చరిత్రలో ఎన్నడూ కాలేవు కాబోలు. ఒక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే అత్యధికంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములను కానరాకుండా చేశారు గులాబీ నేతలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పార్టీ అధినేత సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కబ్జాలకు పాల్పడ్డారు. వీరిని చూసి కిందిస్థాయి నేతలు, నాయకులు, కార్యకర్తలు సైతం అదే దారిలో పయనించారు. అందులో భాగంగా జ‌వహర్‌న‌గర్ మాజీ మేయర్ కూడా అక్రమాలకు పాల్పడ్డది. సామాన్యుల కోసమే చట్టాలు అంటు కోట్ల విలువ చేసే ప్రభుతం స్థలం చుట్టూ కంచ వేసి ఇద్దంతా నాదే అని మాజీ మేయర్ కావ్య(KAVYA) అంటున్నది.

పొట్టకూటి కోసం నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్‌న‌గ‌ర్ నుండి బోయిన్‌ప‌ల్లి ప్రాంతానికి వలస వచ్చి సెంట్రింగ్ పని చేసుకునే అయ్యప్ప. మాజీ మంత్రి మల్లారెడ్డికి భవన నిర్మాణంలో నమ్మకమైన కాంట్రాక్టర్ గా దగ్గరయ్యాడు. నాలుగు కోట్ల రూపాయాలతో సీఎంఆర్ కాలేజ్ భ‌వన నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాడు. ఇంకేముంది అంత నా చేతుల్లోనే ఉంది కదా.. జవహర్ నగర్ కు నిన్ను రాజును చేస్తానంటూ అయ్యప్పకు మ‌ల్లారెడ్డి మాటిచ్చాడు. రిజర్వేషన్ మహిళలకు రావడంతో అయ్యప్ప తన కూతురు కావ్యను కార్పొరేటర్ గా గెలిపించి, మల్లారెడ్డి సాయంతో మేయర్ ను చేశాడు. భవన నిర్మాణానికి నాలుగు కోట్లు రూపాయల ఖర్చు రద్దు చేస్తూ బోనస్ గా మరో రెండు కోట్లు ఇచ్చి పదవి బాధ్యతలు తీసుకున్నాడు.

జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని లాల్ బాగ్ సర్వేనెంబర్ 474, 475, 476, 501, 502లో సుమారు 5 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో రెండు ఎకరాల స్థలం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా ముత్తయ్య పేరుపై ప్రభుత్వం జారీ చేసింది. ముత్తయ్య చనిపోవడంతో ఆయన భార్య రాజమ్మకు ప్రభుత్వం నుంచి ఎన్ఓసి ఇచ్చింది. ఆ స్థలం కాస్త మ‌రొక‌రికి అమ్మేసింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేయర్ పదవి తెచ్చుకోని ఇంట్లో కూర్చుంటే ఏం లాభం అనుకుందేమో. జ‌వహర్‌న‌గర్ చుట్టూ జల్లెడ పట్టి ఎక్స్ సర్వీస్ మెన్ల భూములు కొనుగోలు చేస్తూ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాలకు కంచె వేసిన జోహార్ నగర్ మేయర్ మేకల కావ్యపై ప్ర‌త్యేక క‌థ‌నం..

సర్వేనెంబర్ 501, 502లో ప్రభుత్వ స్థలం ఖతం:
రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టు.. మేయర్ అక్రమాలు చేస్తే అడ్డెవరూ అనుకున్నది. ప్రభుత్వం మాదే పాలన మాదే.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను సైతం అణిచివేసి మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రోత్సాహంతో ప్రభుత్వ స్థలాలకు కంచ వేసిన ఘనత మల్లారెడ్డి తర్వాత మాజీ మేయర్ కావ్యకే ద‌క్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని లాల్ బాగ్ లోని సర్వే నెం. 501, 502లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిది.

మాజీ మేయర్ పై హైడ్రాకు ఫిర్యాదు :
హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ, అసెన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ వాటిని రక్షించే పనిలో పడ్డది. దీనికోసమే హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. దానికి కమిషనర్ గా డైనమిక్ ఆఫీసర్ రంగనాథ్ ను నియమించింది. కాగా జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్వపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు కో ఆప్షన్ సభ్యురాలు శ్వేత కంప్లైంట్ చేశారు. మాజీ మేయర్ మేకల కావ్య, కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాలలో గెస్ట్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకొని కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని లిఖిత‌ పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ప్రతి ఒక్కరికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే అధికారంలో ఉన్నప్పుడు అంతే నాదే అంటూ విర్రవీగిపోయిన ప్రజా ప్రతినిధులకు ఈ ప్రభుత్వం చెక్ పెట్టనుందా వేచి చూడాలి. మాజీ మేయర్ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో జవహర్ నగర్ కార్పోరేటర్ లు అంతా కలిసి మేయర్ పై అవిశ్వాసం పెట్టి మేయర్ పదవి నుంచి ఆమెను తొలగించారు. కోట్లు విలువ వేసే ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య.. కేసిఆర్, కేటీఆర్ తో పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి, మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో అన్యాక్రాంతం అయిన కోట్లాది రూపాయల విలువ చేసే భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రేవంత్ సర్కార్ దృష్టి సారించి ప్రభుత్వ, అసైన్డ్ భూములు కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS