Wednesday, January 15, 2025
spot_img

పాలమూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా

Must Read
  • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం
  • పాలమూరు జిల్లాను శశశ్యామలం చేసి అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం
  • నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే త‌దిత‌రులు

నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజర్యారు. సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఐదు సంవత్సరాల్లో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని, పాలమూరు జిల్లాకు త్రాగు, సాగు నీరు అందించడానికి కృష్ణా నదిలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి ఎంత ఖర్చు చేయడానికి అయినా ప్రజా ప్రభుత్వం వెనుకాడదన్నారు భట్టి విక్రమార్క. రూ. 38వేల కోట్ల తో మొదలుపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గాలికి వదిలేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఈ ఐదు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామన్నారు.

అంతేకాకుండా..’అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ఉమామహేశ్వర, చిన్న కేశవ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన రాజకీయ నాయకుల చెంపలు చెల్లుమనే విధంగా రైతు భరోసా పెట్టుబడి పదివేల నుంచి 12 వేలకు పెంచుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు ఇవ్వబోతున్నది. రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,వేల రూపాయలు ఇస్తాం. ఈనెల 26 నుంచి ప్రక్రియ మొదలు కాబోతుంది. రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటు సబ్సిడీ డబ్బులను రైతుల తరఫున ప్రభుత్వం ఏడాదికి రూ 12 వేల కోట్లు విద్యుత్తు శాఖకు చెల్లిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటును గృహ జ్యోతి పథకం ద్వారా గత మార్చి ఒకటి నుంచి ఇస్తున్నాం. డిస్కంలో పై భారం పడకుండా ప్రజా ప్రభుత్వం ఆ డబ్బులను చెల్లిస్తున్నది. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడంతో పాటు పంట బీమా, రైతు బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తున్నది. పైరవీలు లేకుండా, దళారుల బెడద లేకుండా అవసరం ఉన్నచోట అడిగిన రైతులకు సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిది. విద్యుత్ శాఖలో అత్యవసర సమస్యల పరిష్కారం కొరకు 1912 నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చాం. రైతులకు, విద్యుత్ అవసరాలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసిన సామాగ్రిని రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీ లేకుండా అందజేయడానికి కావలసిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 123 జీవో కింద నిర్వాసితులకు ఎకరానికి ఐదు లక్షలు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న గత కేసీఆర్ సర్కార్.

భూ సేకరణ నిధులను ప్రాధాన్యత క్రమంలో నిర్వాసితులకు విడుదల చేస్తాం. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని సంపూర్ణంగా అమలు చేస్తాం. సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం పేదలకు 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నది. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేయబోతున్నాం. మహిళలను కోటీశ్వరులుగా చేయాలని వడ్డీ లేని రుణాలు ఏడాదికి 20వేల కోట్లు, ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు ఇస్తాం. వడ్డీ లేని రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మహిళలు ముందుకు పోవాలి. పాడి పరిశ్రమ ద్వారా ఎదగాలని మహిళలను ప్రోత్సహిస్తున్నాం. పాలమూరు జిల్లాలో యువత ఉపాధికి కావలసిన అన్ని సహాయ సహకారాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుంది. పాలమూరు జిల్లా ప్రజా ప్రభుత్వానికి ప్రీతి పాత్రం. పాలమూరు జిల్లా అభివృద్ధి చెందితే యావత్తు తెలంగాణ రాష్ట్రం సంతోషపడుతుంది. వచ్చే ఐదు సంవత్సరాల్లో పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. సీఎల్పీ నేతగా పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నాము.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS