- “నో కబ్జా యాప్” ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
- నోకాబ్జా – భూస్వాముల భద్రతకు సాంకేతిక పరిష్కారం
- మోసాల రహిత భూకొనుగోలు & అమ్మకాలకు పూర్తి రక్షణ
- రియల్ రంగాన్ని ఉపాధి చేసుకునే వారికీ నోకాబ్జా ఓ కల్పవృక్షం
- క్రయ విక్రయ దారులకు నో కబ్జా యాప్ దిక్సూచిలా ఉంటుంది
భూస్వాములు మరియు పెట్టుబడిదారుల అక్రమ ఆక్రమణల నుంచి భూ కొనుగోలుదారులను రక్షించేందుకు “నో కబ్జా యాప్” ని రూపొందించడం జరిగింది.. ఈ “నో కబ్జా యాప్” మరియు బ్రోచర్ ని శుక్రవారం జూబ్లీహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమిని కొనేవారికి, అమ్మాలనుకున్న వారికీ, కొన్నవారికి అందరికి అన్ని రకాలుగా ఉపయోగ పడేలా సురక్షితమైన ఓ వ్యవస్థలా ఉందని కొనియాడారు. “నోకాబ్జా” యాప్, భూస్వాములు మరియు పెట్టుబడిదారులను అక్రమ, ఆక్రమణలు, భూకబ్జాలు, నకిలీ లావాదేవీల నుండి కొనుగోలుదారులను రక్షించే AI ఆధారిత భూ పరిశీలన మరియు భద్రతా సేవ యాప్ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు..
ఎన్ఆర్ఐలకు భూసంరక్షణలో నోకాబ్జా ప్రాముఖ్యత
ఇటీవల మనదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, చాలా మంది ఎన్ఆర్ఐలు తమ దేశం పట్ల ప్రేమతో, తమ ఊరి పట్ల గౌరవంతో, భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించే ప్రయత్నంలో తాము పుట్టిపెరిగిన ప్రాంతాల్లో భూముల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, వారి భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వారి దూరస్థితిని దృష్టిలో ఉంచుకుంటే చాలా కష్టతరం. ఈ సమస్య మోసగాళ్లకు ఓ అస్త్రంగా మారింది. ఇటీవల, కొందరు దళారులు భూములపై అవగాహన లేని వ్యక్తుల ఆస్తులను, ఎన్ఆర్ఐల భూములను లక్ష్యంగా చేసుకుని భూ దందాలను యదేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి భూ అక్రమ లావాదేవీలకు చెక్ పెట్టేందుకు “నోకాబ్జా” సమగ్ర భూ పర్యవేక్షణ యాప్ పరిష్కారం చూపనుంది…
నోకాబ్జా – భూస్వాముల భద్రతకు సాంకేతిక పరిష్కారం
ఈ యాప్ డ్రోన్ నిఘా, ఉపగ్రహ చిత్రాలు, ఆవర్తన సైట్ తనిఖీలు, సమయానుసార హెచ్చరికలు అందించడం ద్వారా భూమి అనధికార కార్యకలాపాల నుండి రక్షితంగా ఉందని నిర్ధారిస్తుంది. నోకాబ్జా యాప్ ప్రతి ఆస్తిని క్రమంగా ట్రాక్ చేసి, ఆక్రమణలు మరియు మోసాలను నిరోధించడంతో పాటు భూస్వాములకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. భూమిని కొనుగోలు చేసే ముందు ఎన్ఆర్ఐలు, భూములపై అవగాహన లేని పెట్టుబడిదారులు అన్ని అంశాలలో స్పష్టమైన అవగాహన పొందేలా నోకాబ్జా దిక్సూచిలా పనిచేస్తుంది. ముఖ్యంగా,
✔ భూముల చట్టపరమైన స్థితి
✔ యాజమాన్య చరిత్ర
✔ సర్కారు వర్గీకరణలు
పై అంశాలను స్పష్టంగా పరిశీలించి నివేదిక అందించడం ద్వారా పెట్టుబడిదారులకు చక్కటి మార్గదర్శనం అందిస్తుంది. అంతేకాకుండా, భూములను కొనుగోలు చేసే వారిని మోసాల భారిన పడకుండా, అక్రమ దళారుల మాయ మాటలకు లోనుకాకుండా, నోకాబ్జా లోతైన శోధన చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన “సెర్చ్ రిపోర్ట్” (Search Report) సేవను అందిస్తుంది.ఈ సెర్చ్ రిపోర్ట్ ద్వారా, భూమి చట్టబద్ధంగా స్పష్టమైనదా? వివాదాస్పదమైనదా? నిరోధిత జాబితాలో ఉందా? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు.ఈ సేవలో, ప్రభుత్వం నిరోధించిన మండలాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు (EC), టైటిల్ చరిత్ర, చట్టపరమైన వివాదాల డేటా అందుబాటులో ఉండటంతో భూములపై పెట్టుబడులు పెట్టే ముందుగానే సురక్షితంగా నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది.
మోసాల రహిత భూకొనుగోలు & అమ్మకాలకు పూర్తి రక్షణ
భూమిని కొనాలని లేదా అమ్మాలని చూస్తున్న వారికి, నోకాబ్జా తన యాప్ ద్వారా చట్టబద్ధంగా ధృవీకరించబడిన మరియు సురక్షితమైన భూముల జాబితాను అందిస్తుంది.
✔ ప్రతి లావాదేవీ పారదర్శకంగా ఉంటుంది
✔ నిజమైన భూమి యజమానులను మాత్రమే లిస్టింగ్‌కు అనుమతిస్తాము
✔ ప్రతి జాబితా కఠినమైన ధృవీకరణ ప్రక్రియలోకి వెళ్తుంది
✔ వినియోగదారులు భద్రంగా & మోసాలకు గురికాకుండా చూడబడుతుంది
✔ ఒకవేళ వెంచర్, వ్యవసాయ భూమి లేదా నివాస ప్లాట్లను కొనుగోలు చేసినా, నోకాబ్జా ఒక మోస రహిత వేదికను అందిస్తుంది.
రియల్టర్ నే ఉపాధి చేసుకునే వారికీ నోకాబ్జా ఓ కల్పవృక్షం
తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కొనుగోలుదారులు అమ్మకపు దారులు మధ్యవర్తుల సహాయంతో భూముల అమ్మకాలు.. కొనుగోళ్లు జరుపుతున్నారు.. వీటిలో చాలా భూముల తాలూకు ఖచ్చితమైన సమాచారం మధ్యవర్తులుకు తెలియవు.. దీంతో వీరు మోసపోవడమేగాక వీరిని ఆశ్రయించిన వ్యక్తులు మోసపోవడానికి, నష్టపోవడానికి వీరే ఒక కారణం అవుతున్నారు..కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు .సమస్యల పాలవుతున్నారు.
ఈ సమస్యలన్నింటికి నో కబ్జా పరిష్కారం చూపే వేదిక కానుంది.. సాధారణంగా ఈ భూముల క్రయ, విక్రయాలను జరిపేవారిని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.. లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అని పిలుస్తుంటారు.. కానీ నొకబ్జా యాప్ లో రిజిస్టర్ అయిన మధ్యవర్తులుకు ఎప్పటికప్పుడు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందించడమే గాక వారికీ ఓకే ఐడి ని కేటాయించి వారిని ల్యాండ్ ప్రొటెక్టర్స్ గా గౌరవించడం జరుగుతుంది.. నో కబ్జా యాప్ లో రిజిస్టర్ అయిన ల్యాండ్ ప్రొటెక్టర్స్ కు ఎటువంటి ఫీజులు గాని ఛార్జీలుగాని ఉండవు.. కొనుగోలుదారుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఈ యాప్ ల్యాండ్ ప్రొటెక్టర్స్ కు ఒక అదనపు ఆదాయ వనరుగా ఉండబోతుంది.. ఈ కార్యక్రమంలో “నో కబ్జా ఆప్” ఫౌండర్ డైరెక్టర్స్ జవ్వాది లక్ష్మయ్య నాయుడు, వీరమల్ల సత్యం గౌడ్, మహేష్ భూపతి, ఐవీ రెడ్డి తో పాటు రిటైర్డ్ తహసిల్దార్ రాంచందర్ గౌడ్, సందీప్, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గౌని నర్సింహ గౌడ్, రెడీ టు సర్వ్ ఫౌండర్ చైర్మన్ పెద్ది శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.