Friday, August 15, 2025
spot_img

దొంగలను అరెస్ట్‌ చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్‌లు

Must Read
  • రూ.30 లక్షల విలువగల
  • 35.4 తులాల బంగారం స్వాదినం
  • 6 గురు దొంగలు అరెస్ట్‌..
  • ఒక దొంగ పరారీ
  • హుజూర్‌ నగర్‌,మునగాల,చివ్వెంల
    పిఎస్‌ పరిధిలో దొంగతనాలు
  • మీడియా సమావేశంలో వివరాలు
    వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌

సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ మీడియాకు వివరాలు తెలిపారు. హుజూర్‌ నగర్‌, చివ్వెంల, మునగాల పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుండి రూ.30 లక్షల విలువ చేసే 35.4 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, 06 మోబైల్స్‌, మూడు ద్వి చక్ర వాహనాలు స్వాదినం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను రిమాండ్‌ కు పంపినట్లు తెలిపారు. ఒక దొంగ పరారయ్యారు. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళా ఒంటిపై బంగారం, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న జంటలను బెదిరించి దొంగతనాలకు, రాబరీలకు దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నా రు. తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనలను చేస్తున్న దొంగల ను కూడా అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. స్త్రీ పురుషులను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న విషయమై భాదితులు పోలీసులకు పిర్యాధు చేయాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ నాగేశ్వరావు, కోదాడ డిఎస్పీ శ్రీధర్‌ రెడ్డి, మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి, సూర్యాపేట రూరల్‌ సిఐసురేంధర్‌ రెడ్డి, సిసిఎస్‌ సిఐ ఆనంద్‌ కిషోర్‌, ఎస్సైలు శ్రీకాంత్‌, వెంకట్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, ముత్తయ్య, సాయి ప్రశాంత్‌, రత్నం, సిబ్బంది ఉన్నారు. కేసుల్లో బాగా పని చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డ్‌ అందించారు.

Latest News

జెండా పండుగ అంటే…

అది ఒకవస్త్రాన్నికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో సంబంధించిన వేదిక కాదు..భరత జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పే మహోన్నత వేడుక..!సామాజిక మాధ్యమాల్లోనో, బడుల్లోనో ఒకనాడు కనిపించే...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS