Wednesday, July 2, 2025
spot_img

జైలులోనే కవిత,బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Must Read

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సోమవారం కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జస్టిస్ గవాయి,జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది.అప్పటి నుండి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు.మరోవైపు కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఇటీవల ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దింతో కవితకు కూడా బెయిల్ వస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS