Saturday, October 4, 2025
spot_img

జులనాలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్

Must Read

హర్యానాలోని జులనా స్థానన్ని కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ కైవసం చేసుకున్నారు. 6015 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి యోగేష్ కుమార్‎కు 59065 ఓట్లు వచ్చాయి. ఈ సంధర్బంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించిందని కొనియాడారు. ఇది ప్రజల పొరటమని,ఇందులో ప్రజలే విజయం సాధించారని తెలిపారు.

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది .జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 5న హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలను నిర్వహించారు. హర్యానా ఎన్నికల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 464 మంది ఇండిపెండెంట్లు, 101 మహిళలు పోటీ చేశారు. 67.90 శాతం ఓటింగ్ నమోదైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

కాంగ్రెస్ – 34/90
బీజేపీ – 50/90
ఐఎన్ఎల్డీ – 02/90
ఇతరులు – 04/90

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

బీజేపీ – 29 / 90
కాంగ్రెస్ – 48/90
పిడీపీ – 03/90
ఇతరులు – 08 / 90

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This